మారుతి సుజుకి సియాజ్ ను టార్గెట్ చేసిన మరో సెడాన్

హోండా మోటార్స్ శ్రేణిలోని సెడాన్‌ల అమ్మకాల్లో పూర్వవైభవాన్ని తీసుకురావడానికి తమ సిటి సెడాన్‌ను ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో విడుదల చేయడానికి సిద్దమైంది.

By Anil

దేశీయ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు సాధించే సెడాన్‌ల జాబితాలో సిటి వెనక్కి తప్పుకుంది. హైబ్రిడ్ సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన మారుతి సియాజ్ దీనికి ప్రధాన పోటీగా నిలిచింది. అయితే అమ్మకాల్లో పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి హోండా తమ సెడాన్‌ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో 2017 జనవరి నాటికి విడుదల చేయనుంది.

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ సెడాన్

దేశీయంగా ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల కానున్న 2017 సిటి లో భారీ అప్‌గ్రేడ్స్ చోటు చేసుకోనున్నాయి. మరీ ముఖ్యంగా హోండా మోటార్స్ చైనాలో ప్రవేశపెట్టిన హోండా గ్రీజ్ సెడాన్ ప్రేరణతో మార్పులకు గురికానుంది.

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ సెడాన్

సరికొత్త ఫేస్‌లిఫ్ట్ సిటి సెడాన్‌లో రీ డిజైన్ చేయబడిన బంపర్లు, హెడ్ లైట్లు, టెయిల్ లైట్ల క్లస్టర్ తో పాటు ఎల్‌ఇడి లైట్లను ఉపయోగించినపుడు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి.

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ సెడాన్

2017 ఫేస్‌లిఫ్ట్ సిటి లో ఆపిల్ కార్ ప్లే మరియు గూగుల్ అండ్రాయిడ్ ఆటో రెండింటిని సపోర్ట్ చేసే అధునాతన తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రానుంది.

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ సెడాన్

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అకార్డ్‌లో వినియోగిస్తున్న మరియు అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉన్న హోండా కార్లలో ఉపయోగిస్తున్న తరహాలో ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండనుంది.

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ సెడాన్

సాంకేతికంగా ఈ సరికొత్త 2017 ఫేస్‌లిఫ్ట్ సిటి సెడాన్ 1.5-లీటర్ సామర్థ్యంతో పెట్రోల్ మరియు డీజల్ ఇంధన వేరియంట్ల ఇంజన్‌లు పరిచయం కానున్నాయి. ప్రస్తుతం హోండా బిఆర్-వి లోని 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇందులోని పెట్రోల్ వేరియంట్‌కు అనుసంధానం చేసే అవకాశం ఉంది.

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ సెడాన్

ధర విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న సిటి సెడాన్‌ కన్నా కాస్త ఎక్కువ ధరతో రానుంది, అది కూడా నూతనంగా అందిస్తున్న ఫీచర్లకు లోబడి ధరలను నిర్ణయించనుంది. ప్రస్తుతం సిటి సెడాన్ యొక్క ధరల శ్రేణి రూ. 8.22 నుండి 12.55 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ సెడాన్
  • ఉబర్ ప్లైయింగ్ కార్లు వచ్చేస్తున్నాయ్...!!
  • సుజుకి సియాజ్ హైబ్రిడ్ కు సిద్దమైన పోటీ..!!
  • ఇండియాలో రోడ్డుకు ఎడమవైపు డ్రైవ్ చేయడం వెనకున్న సీక్రెట్స్

Most Read Articles

English summary
Read In Telugu: Honda City Facelift India Launch 2017 January
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X