వాణిజ్య వాహనాల విభాగంలో హ్యుందాయ్ మోటార్స్

Written By:

కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ దేశీయ మార్కెట్లోని ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు దేశీయ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది.

సమాచార వర్గాల కథనం మేరకు, భారతీయ వాహన రంగంలో ప్యాసింజర్ కార్లతో పాటు కమర్షియల్ వాహనాలకు మంచి మార్కెట్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కమర్షియల్ వెహికల్ తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది.

హ్యుందాయ్ కమర్షియల్ వాహనాలు ప్రపంచ వ్యాప్తంగా 130 కి పైగా దేశాలలో అమ్ముడుపోతున్నాయి. హ్యుందాయ్ ముందుగా తమ చిన్న వాణిజ్యపరమైన వాహనాలను మరియు బస్సులను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

హ్యుందాయ్ కమర్షియల్ వాహనాల విభాగాన్ని దేశీయంగా ప్రారంభించే విషయాన్ని కంపెనీ ఇంకా దృవీకరించలేదు. అయితే హ్యుందాయ్ ఒక ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా 1,00,000 యూనిట్ల కమర్షియల్ వాహనాలు అమ్ముడుపోతున్నాయి.

దేశీయ విపణిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాల పరంగా మంచి విజయాన్ని అందుకొన్న హ్యుందాయ్, కమర్షియల్ వాహనాల పరంగా కూడా ఇదే తరహా ఫలితాలు రావచ్చనే అంచనాతో ఉంది.

కార్ల ఉత్పత్తి ద్వారా ప్రారంభమైన హ్యుందాయ్ 1978 నుండి బస్సులను మరియు 1984 నుండి ట్రక్కులను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం కొరియా, టర్కీ మరియు చైనా లలో హ్యుందాయ్ కమర్షియల్ వాహనాల ప్రొడక్షన్ ప్లాంట్లు ఉన్నాయి.

హ్యుందాయ్ కమర్షియల్ మార్కెటింగ్ విభాగంలోకి ఇండియాను చేర్చడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మంచి రేటింగ్‌తో పాటు అమ్మకాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఇండియాలో దీర్ఘకాలిక అమ్మకాలు సాధ్యమయ్యే అవకాశం ఉందని హ్యుందాయ్ భావిస్తోంది.

ప్రస్తుతం ఇండియన్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో మద్య మరియు హెవీ వాణజ్య వాహనాల పాత్ర ఎక్కువగా ఉంది. వీటి పరంగా టాటా మోటార్స్ మరియు అశోక్ లేలాండ్ సంస్థ రాజ్యమేలుతున్నాయి.

వాణిజ్య వాహనాల మొత్తం మార్కెటింగ్‌లో టాటా మోటార్స్‌కు 55 శాతం మరియు అశోక్ లేలాండ్‌ 30.6 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Saturday, December 3, 2016, 13:52 [IST]
English summary
Hyundai Eyes To Enter Indian Commercial Vehicle Market
Please Wait while comments are loading...

Latest Photos