ఇయాన్ ఫేస్‌లిఫ్ట్‌ను అభివృద్ది చేస్తోన్న హ్యుందాయ్: వివరాలివిగో...

హ్యుందాయ్ మోటార్స్ ఇయాన్ ఫేస్‌లిఫ్ట్‌ను అభివృద్ది చేస్తోంది. వచ్చే ఏడాది దీనిని మార్కెట్లోకి విడుదల చేసే ఆలోచనలో ఉంది.

By Anil

హ్యుందాయ్ మోటార్స్ తమ ఇయాన్‌కు మెరుగులు దిద్దడానికి సిద్దమైంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో దీనికి పోటీగా ఉన్న క్విడ్ వంటి ఉత్పత్తులను ఎదుర్కోవడానికి ఇయాన్‌ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేసి తమ ఎంట్రీ లెవల్ కారుకు మళ్లీ జీవం పోయనుంది.

హ్యుందాయ్ ఇయాన్ ఫేస్‌లిఫ్ట్

ఆటో కార్ ప్రచురించిన కథనం మేరకు హ్యుందాయ్ మోటార్స్ తమ ఇయాన్ ద్వారా ఆశించిన స్థాయిలో ఫలితాలను పొందలేకపోతోంది. దీనికి తోడుగా పోటీ కూడా ఎక్కువైపోయింది. అయితే భారీ విక్రయాల మీద దృష్టి సారిస్తూ ఇయాన్‌ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో మళ్లీ పరిచయం చేయనుంది.

హ్యుందాయ్ ఇయాన్ ఫేస్‌లిఫ్ట్

ఇయాన్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా గుర్తించదగిన రీతిలో ఓ మోస్తారు మార్పులు చోటు చేసుకోనున్నాయి.

హ్యుందాయ్ ఇయాన్ ఫేస్‌లిఫ్ట్

నెక్ట్స్ జనరేషన్‌గా పరిచయం కానున్న ఈ ఇయాన్ ఫ్రంట్ డిజైన్‌లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న ముందు వైపు రూపాన్ని దాదాపుగా మార్చేసే అవకాశం ఉంది.

హ్యుందాయ్ ఇయాన్ ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్ పరంగా ప్రస్తుతం పోటీదారుల ఉత్పత్తుల్లోని ఇంటీరియర్ ఫీచర్లకు ఏ మాత్రం తగ్గకుండా మార్పులకు శ్రీకారం చుట్టనుంది హ్యుందాయ్. ముఖ్యంగా రెనో క్విడ్ ను తలదన్నే రీతిలో తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రానుంది.

హ్యుందాయ్ ఇయాన్ ఫేస్‌లిఫ్ట్

2017 నాటికి విడుదలయ్యే అవకాశం ఉన్న ఈ ఫేస్‌లిఫ్ట్ ఇయాన్‌ 0.8-లీటర్ లేదా 1.0-లీటర్ సారమర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ తరహా వేరియంట్లు హ్యుందాయ్ లైనప్‌లో ఇప్పటికే ఉన్నాయి.

హ్యుందాయ్ ఇయాన్ ఫేస్‌లిఫ్ట్

వచ్చే ఏడాదిభారతీయ రహదారులను తాకనున్న ఈ ఇయాన్ ఫేస్‌లిఫ్ట్ ధరలు కూడా దాని విలువకు తగ్గట్టుగా భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే పోటీదారులను దృష్టిలో ఉంచుకుని దీని ధరను నిర్ణయించనుంది హ్యుందాయ్.

హ్యుందాయ్ ఇయాన్ ఫేస్‌లిఫ్ట్

  • మూడు బైకుల మధ్య ముదిరిన పోటీ: ఇందులో మీ ఏది ఎంపిక ?
  • అతి సుందరమైన రైలు మార్గాలు...
  • 2019 నాటికి డీజల్ స్థానంలోకి హైబ్రిడ్ ఇంజన్ లు

Most Read Articles

English summary
Hyundai Working On Eon Facelift — Details Revealed
Story first published: Monday, December 19, 2016, 10:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X