భారత జనప్రియ కారు ప్రొడక్షన్ నిలిపివేసిన హ్యుందాయ్

ఇండియన్స్ అమితంగా ఎంచుకుంటున్న ఐ10 హ్యాచ్‌బ్యాక్ ప్రొడక్షన్‌ను హ్యుందాయ్ మోటార్స్ పూర్తిగా నిలిపివేసింది.

By Anil

హ్యుందాయ్ మోటార్స్ తమ బెస్ట్ సెల్లింగ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఐ10 చివరి యూనిట్‌ను తమ ఉత్పత్తి ప్లాంటు నుండి విడుదల చేసి, ఇదే చివరి ఐ10 అంటూ దీని ప్రొడక్షన్‌కు ప్రస్తుతం పుల్‌స్టాప్ పెట్టింది.

హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్

గ్రాండ్ ఐ10, ఐ20 మరియు క్రెటా ఎస్‌యువి లకు ఏర్పడిన భారీ డిమాండ్ కారణంగా హ్యుందాయ్ తమ ఐ10 ప్రొడక్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. హ్యుందాయ్ ఈ మధ్యనే విడుదల చేసిన ఎలంట్రా మరియు టుసాన్ లకు మంచి స్పందన లభిస్తుండటం కూడా దీనికి మరో కారణం అని తెలిస్తోంది.

హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్

కొరియాకు చెందిన భారత దేశపు రెండవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తమ కొత్త ఉత్పత్తుల ప్రొడక్షన్‌ను వేగవంతం చేయడానికే ఈ ఐ10 ఉత్పత్తిని ఆలస్యం చేస్తున్నట్లు ప్రకటించింది.

హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్

హ్యుందాయ్ కంపెనీ యొక్క యొక్క పాత ఫ్లూయిడిక్ 1.0 డిజైన్ భాషలో అందుబాటులో ఉన్న ఏకైక మోడల్ ఈ గ్రాండ్. దీనిని 2011లో ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో కూడా విడుదల చేసింది. ఫేస్‌లిఫ్ట్ రూపంలో పరిచయమయ్యాక అమ్మకాల్లో కాస్త మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి.

హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్

ఐ 10 మోడల్‌కు కొనసాగింపుగా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ను విడుదల చేశాక ఐ10 అమ్మకాలకు భారీగా గండిపడింది. ఒకానొక దశలో ఐ10 అమ్మకాలు నెలకు 1,500 యూనిట్ల దిగువకు పడిపోయాయి.

హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్

హ్యుందాయ్ ఐ10 లో 68బిహెచ్‌పి పవర్ మరియు 99ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల1.1-లీటర్ సామర్థ్యం గల ఇంజన్ కలదు. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు. పెట్రోల్ మరియు ఎల్‌పిజి ఇంధన వేరియంట్లలో ఐ10 అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్

నివేదికల ప్రకారం హ్యుందాయ్ సరికొత్త శాంట్రోని అభివృద్ది చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని 2018 నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఆధారం లేని వార్తలు నిత్యం వెలువడుతూనే ఉన్నాయి.

via Team-Bhp

హ్యుందాయ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్

  • హ్యుందాయ్ శాంట్రోని మళ్లీ విడుదల చేయడానికి ఉన్న అతి ముఖ్యమైన కారణాలు...!!
  • 27 లక్షల కారుగా మారిన ఆరు లక్షల: కారు ఎలా ?

Most Read Articles

English summary
Hyundai India Stops Production Of i10 Hatchback
Story first published: Thursday, December 1, 2016, 12:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X