గప్‌చుప్‌గా ఐ20 ఆటోమేటిక్‌ను విడుదల చేసిన హ్యుందాయ్
హ్యుందాయ్ మోటార్స్ తమ బెస్ట్ సెల్లింగ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఐ20 కారును ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల వేరియంట్ రూపంలో ఏ విధమైన సందడి లేకుండా విడుదల చేసింది. ఇప్పటికే మంచి అమ్మకాలు సాధిస్తున్న హ్యుందాయ్ మోటార్స్‌కు పండుగ సీజన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిన ఐ20 ఆటోమేటిక్ ద్వారా అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

దేశీయ విపణిలోకి అందుబాటులోకి వచ్చిన ఐ20 ఆటోమేటిక్‌లో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న విటివిటి, నాలుగు సిలిండర్ల 16-వాల్వ్‌లు కలిగిన పెట్రోల్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 99బిహెచ్‌పి పవర్ మరియు 132ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ట్రాన్స్‌మిషన్ పరంగా ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ చక్రాలకు అందడానికి 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఇదే ట్రాన్స్‌మిషన్‌ను వెర్నా 4ఎస్ మరియు గ్రాండ్ ఐ10 లలో కూడా అందించారు.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఎలైట్ ఐ20 లోని మ్యాగ్నా వేరియంట్లో ఆప్షనల్‌గా అందించారు.

ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, కీ లెస్ ఎంట్రీ, డ్రైవర్ మరియు ప్యాసింజర్ సీట్ల కొరకు సీట్ బెల్ట్ ప్రి టెన్షనర్ మరియు అల్లాయ్ వీల్స్‌ను తలపించే రీతిలో వీల్ క్యాపులు ఉన్నాయి.

ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఇందులో ఇంటిగ్రేటెడ్‌గా రేడియో మరియు ఎమ్‌పి3 ప్లేయర్ గల 2-డిఐఎన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. దీనికి వెనుక వైపున స్పీకర్లు మరియు ట్వీటర్లు కలవు. అంతే కాకుండా ఇందులో బ్లూటూత్, ఎయుఎక్స్ మరియు యుఎస్‌బి పోర్ట్ కనెక్టివిటి కలవు. ఆడియో సిస్టమ్‌ను స్టీరింగ్ లీవ్ మీద అందించిన నియంత్రికల ద్వారా ఆపరేట్ చేయవచ్చు.

ఎలైట్ ఐ20 లోని మ్యాగ్నా వేరియంట్ వెనుక వైపు ప్యాసింజర్‌ల కోసం రియర్ ఏ/సి వెంట్లు కలవు వాటిని మ్యాన్యువల్ గా నియంత్రించవచ్చు. ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న రియర్ వ్యూవ్ మిర్రర్లు కలవు.

హ్యుందాయ్ మోటార్స్ వారి సమాచారం ప్రకారం ఈ ఎలైట్ ఐ20 ఆటోమేటిక్ వేరియంట్లు సెప్టెంర్ రెండవ వారం నుండి దేశ వ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ షోరూమ్‌ల ద్వారా అందుబాటులోకి రానున్నాయి. వీటి ధరలు కూడా అప్పుడే వెల్లడించనున్నారు. మరిన్ని తాజా ఆటోమొబైల్ కథనాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండిండి. పేస్‌బుక్ ద్వారా తాజా ఆటోమొబైల్ సమాచారం పొందుటకు మా పేజిని లైక్ చేయండి.

తెలుగులో నిరంతరం ఆటోమొబైల్ కథనాలను ఫేస్‌బుక్ ద్వారా పొందుటకు మా పేజిని లైక్ చేయండి మరియు ట్విట్టర్ ద్వారా తెలుగులో సమాచారాన్ని పొందుటకు మమ్మల్ని ఫాలో అవ్వండి. మా కథనాల పై మీ అభిప్రాయాలను క్రింద గల కామెంట్స్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు.

- హీరో మోటోకార్ప్ మాస్టర్ ప్లాన్: వరుసగా 15 బైకుల విడుదలకు పథకం
- లగ్జరీ ఎమ్‌పివిని విడుదల చేయనున్న టయోటా ఇండియా
- PSLV కన్నా మరింత చౌకైన రాకెట్‌ను సృష్టించి ఇస్రో శాస్త్రవేత్తలు


Click it and Unblock the Notifications








