దీపావళికి విడుదల కానున్న హ్యుందాయ్ టుసాన్

By Anil

ఇండియా మొత్తం ఎంతగానో ఎదురు చూస్తోన్న హ్యుందాయ్ వారి ఎస్‌యువి టుసాన్ (Hyundai Tucson) వచ్చే దీపావళికి మార్కెట్లోకి విడుదల కానుంది. హ్యుందాయ్ ఇండియా ఈ టుసాన్ ఎస్‌యువిని అక్టోబర్ 24, 2016 న విడుదల చేయనుంది. మరియు దీపావళి నాటికి మార్కెట్లో అమ్మకాలకు సిద్దం కానుంది.

హ్యుందాయ్ టుసాన్ విడుదల వివరాలు

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబై సంస్థ హ్యుందాయ్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. అప్పట్లోనే దీనిని 2016 లోపు మార్కెట్లోకి విడుదల చేస్తామని ప్రకటించింది.

హ్యుందాయ్ టుసాన్ విడుదల వివరాలు

హ్యుందాయ్ టుసాన్ భారతీయులకు కొత్తదేమీ కాదు, 2004 లో అంతర్జాతీయంగా పరిచయం కాగా 2005 లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలయింది.

హ్యుందాయ్ టుసాన్ విడుదల వివరాలు

హ్యుందాయ్ మొదటి తరం టుసాన్‌ను అందుబాటులోకి తెచ్చిన మొదటి ఐదు సంవత్సరాల్లో మంచి అమ్మకాలను సాధించింది. అయితే తరువాత ఐదు సంవత్సరాలకు మార్కెట్ నుండి దీనిని తొలగించింది.

హ్యుందాయ్ టుసాన్ విడుదల వివరాలు

మొదటి తరం టుసాన్ ఎస్‌యువిని అందుబాటులోకి తెచ్చిన సమయంలో ఎస్‌యువిలకు అంత డిమాండ్ ఉండేది కాదు. ఇప్పుడు ఎస్‌యువి సెగ్మెంట్ ఫలితాలను సాధిస్తున్న తరుణంలో హ్యుందాయ్ ఈ టుసాన్‌ను దీపావళి పండుగకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది.

హ్యుందాయ్ టుసాన్ విడుదల వివరాలు

ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానున్న మూడవ తరానికి చెందిన ఈ టుసాన్ క్రెటా కన్నా పై స్థానంలో మరియు శాంటా ఫి ఎస్‌యువికి క్రింది స్థానంలో ఉండనుంది.

హ్యుందాయ్ టుసాన్ విడుదల వివరాలు

హ్యుందాయ్ మోటార్స్ ఈ మూడవ తరానికి చెందిన సరికొత్త టుసాన్‌ హ్యుందాయ్ వారి ఫ్లూయిడిక్ స్కల్పచర్ 2.0 డిజైన్ ఫిలాసఫీతో రూపొందించబడింది.

హ్యుందాయ్ టుసాన్ విడుదల వివరాలు

హ్యందాయ్ సరికొత్త టుసాన్ డిజైన్ పరిశీలిస్తే దీర్ఘకాలం కొనసాగే ఉత్పత్తిగా నమ్మకమైన డిజైన్ శైలిలో ఉంది. ముందు వైపున ఉన్న ప్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా మృదువైన అలలు వంటి గీతలు ప్రక్కవైపునకు అల్లుకున్నట్లు ఉంటుంది.

హ్యుందాయ్ టుసాన్ విడుదల వివరాలు

స్టైలిష్ స్వెఫ్ట్ బ్యాక్ హెడ్ ల్యాంప్స్, స్పోర్టివ్ బంపర్, ఎల్‌ఇడి టెయిల్ లైట్లు కలవు.

హ్యుందాయ్ టుసాన్ విడుదల వివరాలు

ఇంటీరియర్ పరంగా ఇందులో లెథక్ అప్‌హోల్‌స్ట్రే, లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్ మరియు ఇంస్ట్రుమెంట్ ప్యానెల్, బ్లూటూత్, ఎయుఎక్స్ మరియు యుఎస్‌బి కనెక్టివిటీ గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-స్పీకర్లు గల ఆడియో సిస్టమ్, ఎలక్ట్రిక్ లిఫ్ట్ గేట్, ప్యానమెరా సన్ రూఫ్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హ్యుందాయ్ టుసాన్ విడుదల వివరాలు

సాంకేతికంగా ఇందులో 2.0-లీటర్ డీజల్ ఇంజన్ కలదు. ఇది 134బిహెచ్‌పి మరియు 181బిహెచ్‌పి రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేసే ఇంజన్‌గా ఉంది.

హ్యుందాయ్ టుసాన్ విడుదల వివరాలు

ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్‌లకు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లను అనుసంధానం చేసే అవకాశాలు ఉన్నాయి.

హ్యుందాయ్ టుసాన్ విడుదల వివరాలు

హ్యుందాయ్ ఇండియన్ మార్కెట్లోకి దీనిని విడుదల చేస్తే హోండా సిఆర్-వి, స్కోడా ఎటి, శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ వంటి వాటికి పోటీగా నిలవనుంది.

హ్యుందాయ్ టుసాన్ విడుదల వివరాలు

హ్యుందాయ్ వారి టుసాన్ ఎస్‌యువి 20 నుండి 25 లక్షల మధ్య ధరలతో విడుదలయ్యే అవకాశం ఉంది.

హ్యుందాయ్ టుసాన్ విడుదల వివరాలు

  • ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు
  • 2.82 లక్షల వరకు తగ్గిన ఫోర్డ్ ఎండీవర్ ధర: త్వరపడండి
  • లగ్జరీ నౌకల్లో మానవాళికి తెలియని భయంకర రహస్యాలు

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai Tucson Launch Date For India Revealed — Let The Festivities Begin
Story first published: Wednesday, September 28, 2016, 18:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X