అంద, చెంద మార్పులతో 2018 నాటికి సరికొత్తగా విడుదలవుతోంది

హ్యుందాయ్ మోటార్స్ లైనప్‌లో ఉన్న ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌కు మరిన్ని సొబగులద్ది, డిజైన్ మరియు ఫీచర్ల పరంగా అప్‌డేట్స్ చేసి 2018 నాటికి సరికొత్తగా మార్కెట్లోకి మళ్లీ విడుదల చేయనుంది.

By Anil

హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి 2014 ఫిబ్రవరిలో ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ ను పరిచయం చేసింది. అయితే ఇప్పుడు ఈ కొరియా ఆధారిత ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తమ ఎక్సెంట్‌కు కొన్ని మార్పులు చేర్పులు చేసి 2018 నాటిటికి అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల చేయాలని భావిస్తోంది.

2018 హ్యుందాయ్ ఎక్సెంట్

యూరప్ ఆధారిత గ్రాండ్ ఐ10 డిజైన్ లక్షణాలతో సరికొత్త డిజైన్ భాషను జోడించి ఎక్సెంట్ ను నూతన రూపంలో తీర్చిదిద్దనున్నట్లు తెలిస్తోంది.

2018 హ్యుందాయ్ ఎక్సెంట్

ప్రస్తుతం దేశీయంగా ఉన్న ఓలా మరియు ఉబర్ సంస్థలకు కార్లెను అద్దెకు తిప్పుతున్న ఓనర్లు ఎక్కువగా దీనిని ఎంచుకుంటున్నారు. దేశవ్యాప్తం అమ్మకాల్లో ట్యాక్సీ డ్రైవర్లే ఎంచుకుంటున్నారు.

2018 హ్యుందాయ్ ఎక్సెంట్

అయితే ప్రస్తుతం ట్యాక్సీగా చెలామణి అవుతోందనే కారణం చేత హ్యుందాయ్ ఎక్సెంట్‌ను వ్యక్తిగతంగా ఎంచుకోవడానికి కస్టమర్లు సందేహిస్తున్నారు. అయితే 2018 నాటికి విడుదలయ్యే ఎక్సెంట్ మాత్రం పూర్తిగా వ్యక్తిగత వినియోగదారులు మీద దృష్టిసారిస్తుందని తెలిసింది.

2018 హ్యుందాయ్ ఎక్సెంట్

డిజైన్ పరంగా యూరప్ మార్కెట్లో అందుబాటులో ఉన్న గ్రాండ్ ఐ10 ఉత్పత్తి యొక్క అవే డిజైన్ లక్షణాలు ఇందులో పరిచయం కానున్నాయి. రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, హెక్సాగోనల్ ఆకారంలో గరిష్టంగా గాలిని సేకరించే రీతిలో డిజైన్ చేయబడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్ ఇముండిపుతో ముందు భాగం రానుంది.

2018 హ్యుందాయ్ ఎక్సెంట్

సాంకేతికంగా 2018 హ్యుందాయ్ ఎక్సెంట్ 1.1-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ మరియు 1.2-లీటర్ సామర్థ్యం పెట్రోల్ ఇంజన్‌లతో రానుంది. రెండు ఇంజన్ వేరియంట్లు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో రానున్నాయి.

2018 హ్యుందాయ్ ఎక్సెంట్

అయితే హ్యుందాయ్ మోటార్స్ ఇందులో పరిచయం చేయనున్న రెండు ఇంజన్‌లను కూడా అధిక మైలేజ్ మరియు పవర్ ఉత్పత్తి చేసే విధంగా ట్యూనింగ్ చేయనుంది.

2018 హ్యుందాయ్ ఎక్సెంట్

ఇంటీరియర్ పరంగా ప్రస్తుతం ఉన్న టాప్ ఎండ్ వేరియంట్లోని ఫీచర్లతో పాటు దీనికి పోటీగా ఉన్న కాంపాక్ట్ సెడాన్‌లలో ఉన్న ఫీచర్ల అదనపు జోడింపుతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

2018 హ్యుందాయ్ ఎక్సెంట్

హ్యుందాయ్ మోటార్స్ ఈ 2018 ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తే షెవర్లే ఎసెన్షియా, టాటా కైట్5 మరియు ఫోర్డ్ ఆస్పైర్ వంటి ఉత్పత్తులకు గట్టి పోటీనివ్వనుంది.

2018 హ్యుందాయ్ ఎక్సెంట్

  • క్విడ్ పై అరుదైన ఆఫర్
  • టైర్ల పేలుడును అరికట్టే మార్గాలు
  • ఆంద్రప్రదేశ్ లో ఈ వాహనాల కొనుగోలుపై ఎలాంటి ట్యాక్స్ లు ఉండవు

Most Read Articles

English summary
Hyundai Xcent Compact Sedan To Be Updated For Indian Market By 2018
Story first published: Thursday, November 24, 2016, 10:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X