దేశీయంగా లెక్సస్ కార్ల ఉత్పత్తి

Written By:

దేశీయంగా తమ కార్లను విడుదల చేయడానికి సిద్దమైంది లెక్సస్ మోటార్స్. వచ్చే ఏడాది నుండి లెక్సస్ విపణిలోకి తమ ఉత్పత్తులను విడుదల చేయనుంది. అయితే ప్రారంభంలో తమ కార్లను దిగుమతి చేసుకుని తరువాత దేశీయంగా ఉత్పత్తిని ప్రారభించనుంది.

లెక్సస్‌కు మాతృ సంస్థ అయిన టయోటా దేశీయంగా లెక్సస్ కోసం ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేయనుంది. దేశీయంగా కర్ణాటకలోని బెంగళూరులో టయోటా సంస్థకు ఉత్పత్తి ప్లాంటు కలదు. ఇందులో కొంత భాగాన్ని లెక్సస్ కోసం కేటాయించనుంది.

ఇక్కడ అసెంబ్లిగ్ ప్రారంభించి మిగతా చిన్న చిన్న పనులు చేసి దేశ వ్యాప్తంగా అందివ్వడానికి లెక్సస్ సిద్దమవుతోంది. ఇక్కడి నుండే హైబ్రిడ్ కార్ల ఉత్పత్తి కూడా ప్రారంభం కానుంది.

లెక్సస్ యొక్క లెక్సస్ ఇఎస్ 300 అనే మోడల్ దేశీయంగా మొదట అందుబాటులోకి రానున్న ఉత్పత్తి అని తెలిసింది. మరియు ఇండియాలో మొదటి సారిగా ఉత్పత్తి చేయనున్న మోడల్ కూడా ఇదే.

ఇండియాలో ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల ఉత్పత్తి మరియు కొనుగోళ్లకు ఫేమ్ (FAME) అందించే చేయూతను వినియోగించుకుని లెక్సస్ లబ్ధిపొందనుంది.

ఫేమ్ నుండి వచ్చే ప్రతి ఫలాను టయోటా మోటార్స్ తమ క్యామ్రీ హైబ్రిడ్ ను అందివ్వడం ద్వారా పొందుతోంది. ఇదే దారిలో నడవడానికి లెక్సస్ తమ అన్ని హైబ్రిడ్ ఉత్పత్తులను దేశీయంగా పరిచయం చేయనుంది.

డీలర్ల పరంగా ముందు దేశ వ్యాప్తంగా ఉన్న అతి ముఖ్యమైన ప్రదేశాలలో డీలర్ షిప్‌లను ప్రారంభించనుంది. తరువాత తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోనుంది.

దేశీయంగా కొత్తగా ఆరంభం కానున్న సంస్థ మరియు విశ్వసనీయమైన, నాణ్యమైన మరియు విలాసవంతమైన ఉత్పత్తులకు ఇది పేరుగాంచింది. కాబట్టి మంచి ఫలితాలను సాధించే అవకాశాలు ఉన్నాయి.

హైబ్రిడ్‌తో పాటు నాన్ హైబ్రిడ్ ఉత్పత్తులను కూడా దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. అందులో తమ ఫుల్ సైజ్ ఎల్ఎక్స్ ఎస్‌యువి కూడా ఒకటి.

దేశీయం ఆటోమొబైల్ విపణిలో మంచి అవకాశాలు ఉండటం వలన తమ ఎస్‌యువిని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది.

  • సంచలనాలు సృష్టించిన టూ వీలర్లు...!!
  • విపణిలోకి హీరో అచీవర్ 150 విడుదల: ప్రారంభ ధర రూ. 61,800 లు
  • ఇండియన్ మార్కెట్ వైపుకు టయోటా నుండి మరో సెడాన్

  

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Read In Telugu: Lexus To Assemble Cars Locally In India
Please Wait while comments are loading...

Latest Photos