మార్కెట్లోకి మూడు మోడళ్లతో లెక్సస్ ఎంట్రీ

Written By:

టయోటా ఆధారిత లెక్సస్ దేశీయంగా ఈ ఏడాది తమ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది. 2016 ఏడాది చివరి నాటికి మూడు కొత్త ఉత్పత్తులను దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టనుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ఎక్స్ ఎస్‌యువి, ఇఎస్ సెడాన్ మరియు ఆర్‌సి-ఎఫ్ కూపే అనే మూడు మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది.

త్వరలో ప్రారంభించనున్న రిటైల్ ఔట్‌లెట్స్ నుండి తమ ఇఎస్ సెడాన్‌ను హైబ్రిడ్ వెర్షన్‌‌లో కూడా విడుదల చేయనుంది.

ఆర్ఎఫ్-సి కూపే ను లెక్సస్ సుమారుగా కోటి రుపాయల ధరతో మార్కెట్లోకి విడుదల చేయనుంది.

ప్రస్తుతం ఢిల్లీ మరియు ముంబాయ్ నగరాలలో ఒకటి చొప్పున షో రూమ్‌లను ప్రారంభించనుంది. ఇక పూర్తి స్థాయిలో లెక్సస్ కార్యకలాపాలు ప్రారంభిస్తే డీలర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

మూడు ఉత్పత్తులను కూడా కంప్లిట్లీ బిల్ట్ యూనిట్‌గా దిగుమతి చేసుకోనుంది. వీటికి సంభందించిన ముందస్తు బుకింగ్‌లను రానున్న రెండు నెలల్లోపు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

లెక్సస్ అందుబాటులోకి తీసుకురానున్న ఆర్ఎక్స్ 450హెచ్ మోడల్‌ ఎస్‌యువిలో 3.5-లీటర్ సామర్థ్యం గల వి6 ఇంజన్‌ మరియు ఎలక్ట్రిక్ మోటార్‌ను అందిస్తున్నారు.

ఇందులోని శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ మరియు ఇంజన్ సుమారుగా 308బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్‌కు సివిటి గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

లెక్సస్ అందుబాటులోకి తీసుకురానున్న హైబ్రిడ్ ఎస్‌యువి ప్రారంభం ధర సుమారుగా రూ. 40 నుండి 50 లక్షల మద్య ఉండే అవకాశం ఉంది మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 అదే విధంగా ఆడి క్యూ5 లకు ప్రత్యక్ష పోటీగా నిలవనుంది.

లెక్సస్ తమ ఎల్ఎక్స్450డి మోడల్ కారును కూడా మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనిని పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో కూడా అందించనుంది.

  

English summary
Read In Telugu: Lexus To Enter Indian Market With Three Models By This Year End
Please Wait while comments are loading...

Latest Photos