2017 నాటికి దేశీయ మార్కెట్లోకి లెక్సస్

Written By:

ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో విభిన్నమైన ఉత్పత్తులను అందిస్తూ తనదైన ముద్ర వేసుకున్న లెక్సస్ 2017 నాటికి దేశీయ మార్కెట్లోకి తమ ఉత్పత్తులతో ఆరంగ్రేటం చేయనుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి రెండు షోరూమ్‌లను దేశీయంగా తెరవనున్నట్లు తెలిసింది. అయితే దీని ఎంట్రీ సరిగ్గా ఎప్పుడు ఉంటుందో అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

జపాన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ దేశీయంగా ఢిల్లీ మరియు ముంబాయ్ నగరాల్లో షోరూమ్‌లను తెరవనుంది. డిమాండ్‌ను బట్టి షోరూమ్‌లను పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి.

సర్వీసింగ్ మరియు సేల్స్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న మరిన్ని ప్రధాన నగరాలలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోనుంది.

లెక్సస్ సంస్థ ప్రారంభంలో కేవలం హైబ్రిడ్ కార్లను మాత్రమే విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు హైబ్రిడ్ మరియు తమ లైనప్‌లో ఉన్న ఇతర ఉత్పత్తులను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.

భారత ప్రభుత్వం తాజాగ విడుదల చేసిన ఆర్థక ప్రణాళిక ప్రకారం హైబ్రిడ్ వాహనాల మీద రాయితీని ప్రస్తావించలేదు. కాబట్టి హైబ్రిడ్ వాహనాలు అమ్మకాలు ఆశించనంత స్థాయిలో ఉండవు అనే ఉద్దేశంతో కన్వెన్షనల్ కార్లను కూడా విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

లెక్సస్ సంస్థ కు అంతర్జాతీయంగా టయోటా మోటార్స్ మాతృ సంస్థగా ఉంది.

మొదటి సారిగా ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న లెక్సస్ ఇప్పటి వరకు సుమారుగా 70 దేశాల్లో తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది.

లెక్సస్ సంస్థ 1989 లో ఈజి టయోడా అనే వ్యక్తి జపాన్‌లోని నగోయాలో స్థాపించారు.

  

English summary
Read In Telugu: Lexus Coming To India By 2017 With Two Showrooms Initially
Please Wait while comments are loading...

Latest Photos