ఆర్ఎక్స్450హెచ్ ఎస్‌యువి ఇండియా విడుదల ఖరారు చేసిన లెక్సస్

Written By:

టయోటా ఆధారంతో కార్ల కలాపాలను ప్రారంభించడానికి సిద్దమైన లెక్సస్ ఇండియన్ మార్కెట్లోకి మూడు మోడళ్లను విడుదల చేస్తూ తన ప్రస్తానాన్ని ప్రారంభించడానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. దేశీయంగా ఇస్ సెడాన్, ఆర్ఎక్స్ ఎస్‌యువి మరియు టాప్ లైన్ వేరియంట్ ఎల్ఎక్స్ ఎస్‌యువిని విడుదల చేయడానికి లెక్సస్ సుముఖంగా ఉంది.

పెద్ద పరిమాణంలో ఉండే ఎస్‌యువిలను ఎంచుకోవాలనుకునే వారి కోసం ఎల్ఎక్స్ ఎస్‌యువిని మరియు ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించుకుని నడిచే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్న వాళ్ల కోసం ఆర్ఎక్స్ ఎస్‌యువిని విడుదల చేస్తోంది.

లెక్సస్ ఈ నాలుగవ తరం ఆర్ఎక్స్450హెచ్ ను పెట్రోల్ హైబ్రిడ్ వేరియంట్‌గా దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.

ఈ లెక్సస్ ఆర్ఎక్స్ ఎస్‌యువి ప్రస్తుతం విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి మరియు ఆడి క్యూ5 వంటి ఉత్పత్తులకు గట్టి పోటీనివ్వనుంది. జిఎల్‌సి మరియు క్యూ5 లతో పోల్చితే ఈ ఆర్ఎక్స్ లో మాత్రమే హైబ్రిడ్ పరిజ్ఞానం కలదు.

ఆర్ఎక్స్450హెచ్ మోడల్ లో హైబ్రిడ్ సాంకేతికత ఉండటం ద్వారా దీనికి పోటీగా ఉన్న మిగతా రెండు మోడళ్ల కన్నా ఎక్కువ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది. కస్టమర్లు దీనిని ఎలా స్వీకరిస్తారు అనే విషయాన్ని విడుదలైతే తప్ప ధృవీకరించలేం.

సాంకేతికంగా లెక్సస్ ఆర్ఎక్స్450హెచ్ వేరియంట్లో 3.5-లీటర్ సామర్థ్యం గల వి6 పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ పెట్రోల్ ఇంజన్‌కు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం కలదు.

పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ రెండింటి అనుసంధానం ద్వారా గరిష్టంగా 307బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ పవర్ ను నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

లెక్సస్ ఆర్ఎక్స్450హెచ్ మోడల్‌లో విభిన్న డ్రైవింగ్ మోడ్స్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్ అడ్జెస్టింగ్ స్టీరింగ్ కాలమ్, మెమొరీ పరిజ్ఞానం ద్వారా పవర్ అడ్జెస్ట్ హీటెడ్ మరియు వెంటిలేటెడ్ సీట్ వంటివి ఉన్నాయి.

ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, రివర్స్ కెమెరా, పవర్ టెయిల్ గేట్, పవర్ హోల్డింగ్ మరియు హీటెడ్ రియర్ సీట్లు, సన్ రూఫ్, ఆటో బ్రేకింగ్ గల పవర్ అసిస్ట్, ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్, న్యావిగేషన్ వంటి ఫీచర్లు కలవు.

భద్రత పరంగా పది ఎయిర్ బ్యాగులు, వెహికల్ స్టెబిలిటీ కంట్రల్ తో పాటు అన్ని ఇతర భద్రత ఫీచర్లు ఈ లెక్సస్ ఆర్ఎక్స్450హెచ్ లో ఉన్నాయి.

అంతర్జాతీయ వేరియంట్ విషయానికి వస్తే, 20-అంగుళాల అల్లాయ్ చక్రాలను కలిగి ఉంది. అదే దేశీయంగా విడుదలయ్యే మోడల్‌లో 18-అంగుళాల చక్రాలు కలవు.

లెక్సస్ ఈ ఆర్ఎక్స్450హెచ్ ఎస్‌యువి దిగుమతి చేసుకుని అందుబాటులో ఉంచనుంది. పోటీగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి మరియు ఆడి క్యూ5 కన్నా గరిష్ట ధరను నిర్ణయించనుంది. ఇక దేశీయంగా ఉత్పత్తి చేసే అంశాన్ని కాస్త ఆలస్యంగా పరిశీలించనుంది.

లెక్సస్ ఆర్ఎక్స్450హెచ్ ను వచ్చే ఏడాది తొలిసగంలో బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఒక అంచనా ప్రకారం మార్చి 2017 నుండి బుకింగ్స్ ప్రారంభం కావచ్చని రూమర్లు చెబుతున్నాయి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Lexus RX450h SUV India Launch Scheduled For 2017
Please Wait while comments are loading...

Latest Photos