పెద్ద వేట: చైనా మార్కెట్‌వైపు అడుగులేస్తున్న మహీంద్రా

By Anil

విభిన్న రకాల ఉత్పత్తులతో ప్రపంచ దేశాలను తాకుతోంది చైనా. అయితే ఆటోమొబైల్ రంగంలో చైనా తన అడుగులను చైనాకే పరిమితం చేసింది. కారణం ప్రతి దేశంలో కూడా వాహన రంగంలో విపరీతమైన పోటీ ఉంది. అయితే కొన్ని అంతర్జాతీయం సంస్థలు చైనా మార్కెట్లో పాగా వేసుకుంటున్నాయి.

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు

స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా డ్రాగన్ కంట్రీలో తన సామ్రాజ్యాన్ని సృష్టించనుంది. ఈ దెబ్బతో చైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల మనుగడ కాస్త కష్టమయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు

ఆసియా దేశాలలో అది పెద్ద దేశమైన చైనాలో మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి విభాగం పురుడుపోసుకోవడానికి అక్కడ సంస్థలతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తోంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు

చైనాలోని సంస్థతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అభివృద్ది మరియు అమ్మకాల పరంగా సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ఆలోచనలో ఉంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు

దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో ముందంజలో ఉన్న మహీద్రా ఎలక్ట్రిక్ విభాగం ఇండియాతో పాటు ఇంగ్లడ్‌లో కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులో ఉంచింది.

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు

ప్రస్తుతం భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తుల అమ్మకాలు మరియు వీటిని ఆదరించే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంది. అయితే ఇప్పటికే అనేక ప్రపంచ దేశాలు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు అడుగులేస్తున్నాయి.

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు

చైనాలో ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులకు మంచి గిరాకీనే ఉంది. ఈ ఉద్దేశ్యంతోనే చైనాలో మహీంద్రా తమ కార్యకలాపాలను విస్తరించడానికి సుముఖంగా ఉంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు

అన్ని రంగాలతో పోటీ పడుతూ ఎదుగుతున్న చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు కొదవేలేదు. ప్రస్తుతం చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల్లో అగ్రగామిగా ఉన్న జాక్ మా మరియు టెర్రీ గౌ అనే సంస్థలతో మహీంద్రా తీవ్ర పోటీని ఎదుర్కోనుంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు

2020 నాటికి చైనాలో 50 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో చైనా ఉంది. దీనిని అదునుగా చేసుకుని చైనాలో తమ ఉత్పత్తులను విడుదల చేయడానికి మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగం సిద్దమవుతోంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు

చైనా చౌకైన ఉత్పత్తులకు బాగా పేరుగాంచింది కాబట్టి చైనాకు చెందిన భాగస్వామితో మహీంద్రా తమ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంటును నెలకొల్పితే మంచి ఫలితాలను సాధించే అవకాశాలు మహీంద్రాకు మెండుగా ఉన్నాయి.

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ శాంగ్‌యాంగ్‌తో దేశీయంగా భాగస్వామిగా ఉంది. అయితే శాంగ్‌యాంగ్ చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లోని షాంగ్జి ఆటో తో తయారీకి సంభందించిన ఒప్పందం కుదుర్చుకుంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు

శాంగ్‌యాంగ్ ఆధారంతో మహీంద్రా తమ ఎలక్ట్రిక్ ఉత్పత్తుల తయారీ మరియు అమ్మకాలకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే ఇంగ్లాడ్‌ తరువాత మహీంద్రా ఎలక్ట్రిక్‌కు చైనా అతిపెద్ద మార్కెట్ కానుంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలు

  • క్షణాల్లో పాకిస్తాన్‌ను బూడిద చేయగల భారత దేశపు శక్తివంతమైన 10 యుద్ద విమానాలు
  • జపాన్ తొందర పాటు తనమా ? భారత్ వెనకబాటు తనమా...?
  • సంచలనాత్మక విజయంలో టియాగో: అంతా టాటా అదృష్టం

Most Read Articles

English summary
Read In Telugu: Is Mahindra Planning To Tap The Chinese Electric Vehicle Market?
Story first published: Thursday, October 13, 2016, 13:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X