ఈ కార్లను చూస్తే యముడు కూడా యూ టర్న్ తీసుకోవాల్సిందే.. టాప్-10 సేఫెస్ట్ కార్ల లిస్టులో దేశీ కంపెనీల హవా
భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు కారు అంటే కేవలం మైలేజీ, లుక్స్ మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కారు ఎంత బలంగా ఉంది? ప్రమాదం జరిగితే మన ప్రాణాలను కాపాడుతుందా? అనే సేఫ్టీ అంశానికే జనం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి నిదర్శనమే భారత్ ఎన్ క్యాప్ (BNCAP) తాజాగా విడుదల చేసిన సేఫ్టీ రేటింగ్స్. ఈ లిస్టులో భారతీయ కంపెనీలు గ్లోబల్ బ్రాండ్లకు చుక్కలు చూపిస్తూ టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా మహింద్రా, టాటా సంస్థలు తమ కార్లను రోడ్లపై తిరిగే కోటలగా తీర్చిదిద్దాయి.
1. మహింద్రా XEV 9e:
మహింద్రా సంస్థ చరిత్ర సృష్టించింది. వారి కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మహింద్రా XEV 9e భారత దేశంలోనే అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. ఈ కారు అడల్ట్ సేఫ్టీ (పెద్దల రక్షణ) విభాగంలో 32కి 32 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం 81 పాయింట్లకు గానూ 77 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రాణాలకు నూటికి నూరు శాతం గ్యారెంటీ ఇచ్చే కారుగా ఇది రికార్డు సృష్టించింది.

2. టాటా హారియర్ EV:
మహింద్రాకు ఏమాత్రం తగ్గకుండా టాటా మోటార్స్ తన హారియర్ ఈవీ (Harrier EV)తో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది కూడా 77.00 స్కోరుతో 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. టాటా కార్లు అంటేనే ఇనుప పెట్టెల్లా ఉంటాయని పేరుంది. ఆ నమ్మకాన్ని హారియర్ ఈవీ మరోసారి నిజం చేసింది.
3. మహింద్రా BE 6:
మూడో స్థానంలో కూడా మహింద్రా తన పట్టును నిరూపించుకుంది. మహింద్రా BE 6 అడల్ట్ సేఫ్టీలో 31.97 స్కోరు సాధించి, మొత్తం 76.97 పాయింట్లతో టాప్-3లో నిలిచింది. కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, సేఫ్టీలో కూడా మహింద్రా తగ్గేదే లే అంటోంది.

4. కియా సెల్టోస్:
ఈసారి కియా సెల్టోస్ (Kia Seltos) అందరినీ షాక్ కి గురిచేసింది. గతంలో రేటింగ్స్ తక్కువగా ఉన్నా, ఇప్పుడు మాత్రం సెల్టోస్ పెట్రోల్-డీజిల్ (ICE) విభాగంలో దేశంలోనే అత్యంత సురక్షితమైన కారుగా అవతరించింది. 76.90 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచి, సేఫ్టీ విషయంలో తనపై ఉన్న విమర్శలకు చెక్ పెట్టింది.
5. మారుతి సుజుకి విక్టోరిస్:
మైలేజీకి ప్రాధాన్యత ఇచ్చే మారుతి ఇప్పుడు సేఫ్టీ మీద కూడా ఫోకస్ పెట్టింది. మారుతి సుజుకి విక్టోరిస్ (Victoris) 74.66 స్కోరుతో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. 5-స్టార్ రేటింగ్‌తో మారుతి కార్లు కూడా ఇప్పుడు బలమైనవే అని నిరూపించింది.

6. మారుతి ఇ-విటారా:
మారుతి వారి మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ-విటారా (e Vitara) కూడా 74.66 స్కోరుతో ఆరో స్థానంలో ఉంది. ఇది కూడా విక్టోరిస్ లాగే అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది.
7. టాటా పంచ్ EV:
టాటా వారి పాపులర్ మైక్రో ఎస్‌యూవీ పంచ్ ఈవీ (Punch EV) 74.45 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచింది. చిన్న కారు అయినా సరే, ఇది అందించే భద్రత మాత్రం 5-స్టార్ రేంజ్‌లో ఉంటుంది. మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక వరం లాంటిది.
8. హ్యుందాయ్ వెన్యూ:
హ్యుందాయ్ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ (Venue) ద్వారా సేఫ్టీ లిస్టులో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. 73.55 పాయింట్లతో ఇది సేఫెస్ట్ కార్ల జాబితాలో చేరింది. హ్యుందాయ్ కూడా ఇప్పుడు సేఫ్టీలో రాజీ పడటం లేదని దీని ద్వారా స్పష్టమవుతోంది.
9. టాటా సియెర్రా:
తొమ్మిదో స్థానంలో టాటా సియెర్రా (Sierra) నిలిచింది. ఇది 75.87 స్కోరు సాధించింది (పిల్లల రక్షణ విభాగంలో స్కోరు వ్యత్యాసం వల్ల 9వ స్థానం). క్లాసిక్ లుక్ తో పాటు అద్భుతమైన బిల్డ్ క్వాలిటీతో సియెర్రా వినియోగదారుల ప్రాణాలకు భరోసా ఇస్తోంది.
10. మహింద్రా థార్ రాక్స్:
చివరిగా పదో స్థానంలో మహింద్రా థార్ రాక్స్ (Thar ROXX) నిలిచింది. 73.45 స్కోరుతో ఇది 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. ఆఫ్-రోడింగ్ మాత్రమే కాదు, సిటీ డ్రైవింగ్ లో కూడా థార్ రాక్స్ అత్యంత సురక్షితమైన కారు అని ఈ రేటింగ్స్ ద్వారా తేలిపోయింది.


Click it and Unblock the Notifications








