మెర్సిడెస్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర మరియు విడుదల వివరాల కోసం...

మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి నేడు (నవంబర్ 30, 2016) తమ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 31.40 లక్షలు ఎక్స్ షోరూమ్(ముంబాయ్)గా ప్రకటించింది.

By Anil

జర్మనీ దేశానికి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ విపణిలోకి సిఎల్ఎ సెడాన్‌ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేసింది. ముంబాయ్ నగర వేదికగా విడుదలైన సిఎల్ఎ ఫేస్‌లిప్ట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 31.40 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా ఉంది.

 మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్ ధర వివరాలు

మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్ ధర వివరాలు

  • సిఎల్ఎ 200డి స్టైల్ ధర రూ. 31.40 లక్షలు
  • సిఎల్ఎ 200డి స్పోర్ట్ ధర రూ. 34.68 లక్షలు
  • సిఎల్ఎ 200 స్పోర్ట్ ధర రూ. 33.68 లక్షలు
  • అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా ఇవ్వబడ్డాయి.
    మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్

    సరికొత్త మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్ 2.0-పెట్రోల్ మరియు 2.1-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌లతో విడుదలైంది. రెండు ఇంజన్ వేరియంట్లకు 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

    మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్

    ఇందులోని పవర్‌ ఇంజన్ నుండి చక్రాలకు నాలుగు విభిన్నమైన డ్రైవింగ్ పద్దతుల ద్వారా సరఫరా అవుతుంది. అవి, ఎకో, కంఫర్ట్, స్పోర్ట్ మరియు ఇండివిడ్యువల్.

    మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్

    మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌లోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 181బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. కేవలం 7.1 సెంకడ్ల కాలవ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 240కిమీలుగా ఉంది.

    మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్

    ఇక ఇందులోని 2.1-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ గరిష్టంగా 134బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. కేవలం 9 సెకండ్ల కాలంలోనే 100కిమీల రైసింగ్‌కు కారణమయ్యే ఇంజన్‌కు థ్యాంక్స్ చెప్పాల్సిందే. మరియు దీని గరిష్ట వేగం గంటకు 220కిలోమీటర్లుగా ఉంది.

    మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్

    మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో ఉన్న బంపర్ స్వల్ప మార్పులకు గురయ్యింది, ఇక రెండు హెడ్ లైట్ల స్థానంలో ఎల్ఇడి ప్రొజెక్టర్ యూనిట్లను అందించింది.

    మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్

    సిఎల్ఎ లో అధునాతన 17-అంగుళాల, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు వెనుక వైపున స్వల్ప డిజైన్ మార్పులకు గురైన ఎల్ఇడి లైట్లను మెర్సిడెస్ అందించింది.

    మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్

    మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే మరియు గార్మిన్‌కు చెందిన మ్యాప్ జిపిఎస్ సిస్టమ్ సపోర్ట్ గల 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

    మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్

    ఇండియన్ లగ్జరీ సెడాన్ సెగ్మెంట్లోకి విడుదలైన మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్ సిర్రస్ వైట్, జూపిటర్ రెడ్, మౌంటెయిన్ గ్రే మరియు పోలార్ సిల్వర్‌తో పాటు కావనిస్ట్ బ్లూ పెయింట్ జాబ్‌ వంటి విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంది.

    మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ ఫేస్‌లిఫ్ట్

    • వితారా బ్రిజా వీర బాధుడు
    • ఆగలేకపోతున్న చైనా...!!
    • ఈ కార్లు కాలేజ్ స్టూడెంట్స్ కు మాత్రమే....!!

Most Read Articles

English summary
Mercedes CLA Facelift Launched in India; Prices Start At Rs 31.40 Lakhs
Story first published: Wednesday, November 30, 2016, 18:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X