ఇండియన్స్ కోసం 2017 ఇ-క్లాస్ కూపే సిద్దం: చిత్రాలు మరియు ఇతర వివరాలు

Written By:

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి 2017 ఇ-క్లాస్ కూపేను ఆవిష్కరించింది. దీనిని వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న డెట్రాయిట్ ఆటో షో వేదిక మీద ప్రదర్శనకు రానుంది.

ఇ-క్లాస్ కూపే డిజైన్ పూర్తిగా ఎస్-క్లాస్ మరియు సి-క్లాస్ ఆధారంగా రూపొందించబడింది. ఫ్రంట్ డిజైన్‌లో ఎల్ఇడి హెడ్ ల్యాంప్, ట్విన్ బ్లేడ్ గ్రిల్ మరియు వాటి మధ్యలో మూడు పాయింట్ల స్టార్ గల మెర్సిడెస్ బెంజ్ లోగో కలదు.

వెనుక వైపు డిజైన్‌లో టెయిల్ లైట్లకు చుట్టూరా హారిజంటల్ లైట్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. బంపర్ లో రెండు ఎగ్జాస్ట్ గొట్టాలున్నాయి. బూట్ లిట్ మీద చిన్న పరిమాణంలో ఉన్న స్పాయిలర్ కలదు.

ఇ-క్లాస్ కూపే ఇంటీరియర్ లో 12.3-అంగుళాల పరిమాణం గల తాకే తెర కలదు (అచ్చం ఇలాంటి దానిని సాధారణ ఇ-క్లాస్) మరియు అత్యాధునిక ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు.

అంతే కాకుండా 23-స్పీకర్లు గల బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్‌తో పాటుగా గుండ్రటి ఆకారంలో ఉన్న ఫ్రంట్ ఎయిర్ వెంట్‌లు కలవు.

ఈ సరికొత్త ఇ-క్లాస్ కూపే మోడ్యులర్ రియర్ ఆర్కిటెక్చర్ ప్లాట్ ఫామ్ ఆధారంగా అభివృద్ది చేయబడింది. మునుపటి ఇ-క్లాస్‌తో పోల్చితే అన్ని విధాలుగా ఇది పెద్ద పరిమాణంలో ఉంటుంది.

కొలతల పరంగా ఇ-క్లాస్ కూపే పొడవు 4826ఎమ్ఎమ్, వెడల్పు 1860ఎమ్ఎమ్, ఎత్తు 1430ఎమ్ఎమ్ లతో పాటు 2873ఎమ్ఎమ్ వీల్ బేస్ కలదు.

ఇ-క్లాస్ కూపే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇ-క్లాస్ కూపేలో 2.0-లీటర్ సామర్థ్యం గల టర్బో ఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 191బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఇ-క్లాస్ రెండు పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి, ఇ200 మరియు ఇ300. రెండు కూడా ఒకే 2.0-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఈ రెండు కూడా 9-స్పీడ్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో వచ్చాయి.

ఇ-క్లాస్ ఇ200 పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 181బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. మరియు ఇ-క్లాస్ లోని మరో పెట్రోల్ వేరియంట్ ఇ300 మోడల్ గరిష్టంగా 241బిహెచ్‌పి పవర్ మరియు 370ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

ఇ-క్లాస్ లోని టాప్ ఎండ్ వేరియంట్ ఇ400 3.0-లీటర్ సామర్థ్యం గల ట్విన్ టుర్బో ఛార్జ్‌డ్ వి6 ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 328బిహెచ్‌పి పవర్ మరియు 480ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఇంజన్ ఉత్పత్తి చేసే మొత్తం పవర్ 9-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ద్వారా అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

మెర్సిడెస్ ఇ-క్లాస్ ఇ400 వేరియంట్ 5.3 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది.

ఇ-క్లాస్ కూపే మూడు రకాల సస్పెన్షన్ సిస్టమ్ లతో లభిస్తోంది. బేసే స్టీల్ స్ప్రంగ్ డైరెక్ట్ కంట్రోల్ సిస్టమ్, స్టీల్ స్ర్పంగ్ విత్ డైనమిక్ బాడీ కంట్రోల్ సిస్టమ్ ఇది అడాప్టివ్ డ్యాంపింగ్ వ్యవస్థ కలదు. మరియు ఎయిర్ బాడీ కంట్రోల్ సిస్టమ్ కలదు ఇందులో మల్టీ ఛాంబర్ ఎయిర్ స్ప్రింగ్ వ్యవస్థ కలదు.

మెర్సిడెస్ ఇ-క్లాస్ నాలుగు డ్రైవింగ్ మోడ్‌లలో అందుబాటులో కలదు. ఎకో, కంఫర్ట్, స్పోర్ట్ మరియు స్పోర్ట్ ప్లస్.

మెర్సిడెస్ బెంజ్ ఈ ఇ-క్లాస్ కూపే వాహనాలను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేసి ఏప్రిల్ నుండి డెలివరీలు ఇవ్వనుంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
2017 Mercedes E-Class Coupe Unveiled
Please Wait while comments are loading...

Latest Photos