మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 400 4మ్యాటిక్ విడుదల
మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి తమ ఎస్ క్లాస్ శ్రేణిలోకి జిఎల్ఎస్ 400 4మ్యాటిక్ ఎస్‌యువిని విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 82.90 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు తెలిపింది. 2016 ఏడాదికి గాను దేశీయ విపణిలోకి సుమారుగా ఎనిమిది కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇంతకు మునుపు కథనంలోనే ప్రకటించింది.

మెర్సిడెస్ బంజ్ తమ జిఎల్‌ఎస్ ఎస్‌యువిలను కేవలం డీజల్ వేరియంట్లలో మాత్రమే అందించేది. అయితే ఇప్పుడు పెట్రోల్ వెర్షన్ జిఎల్ఎస్ లను కూడా అందించింది. కాబట్టి దేశ వ్యాప్తంగా వినియోగదారులు రెండు ఇంజన్ ఆప్షన్‌లలో ఉన్న జిఎల్ఎస్ ఎస్‌యువిలను ఎంచుకునే అవకాశం కల్పించింది.

జిఎల్ఎస్ 400 4మ్యాటిక్ ఎస్‌యువిలో 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న వి6 పెట్రోల్ ఇంజన్‌న అందించారు.

ఈ ఇంజన్ సుమారుగా 333బిహెచ్‌పి పవర్ మరియు 480ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్‌కు 9జి-ట్రోనిక్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ఇప్పుడు ఈ జిఎల్ఎస్ 400 4మ్యాటిక్ లో కంఫర్ట్, స్పోర్ట్, స్లిప్పరీ, ఇండివిడ్యువల్ మరియు ఆఫ్ రోడ్ అనే డ్రైవింగ్ మోడ్‌లను అందించారు.

మెర్సిడెస్ బెంజ్ ఇందులో ఎయిర్‌మ్యాటిక్ సస్పెన్షన్ సిస్టమ్ మరియు ఆడాప్టివ్ డ్యాంపింగ్ సిస్టమ్‌లను కూడా కలిగి ఉంది. కొత్త తరం టెలిమ్యాటిక్ సిస్టమ్ కూడా ఇందులో పరిచయం చేసారు.

భద్రత పరంగా ఇందులో స్టాండర్డ్ ప్రి సేఫ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ ఆల్ వీల్ డ్రైవ్ ట్రాక్షన్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, కర్వ్ డైనమిక్ అసిస్ట్ మరియు క్రూయిజ్ కంట్రల్ వంి భద్రత ఫీచర్లు ఉన్నాయి.

కేవలం రెండు రంగుల్లో మాత్రమే దీనిని అందుబాటులోకి తెచ్చారు. అవి, పోలార్ వైట్ మరియు ఆబ్సిడియాన్ బ్లాక్. ప్రస్తుతం వీటిని కంప్లిట్లి బిల్ట్ యూనిట్‌గా దిగుమతి చేసుకుంటున్నారు. 2016 చివరి నాటికి దేశీయంగా ఉన్న చకన్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి మొదలు పెట్టనున్నారు.

- అర్థం లేని నిర్ణయంతో హ్యుందాయ్‌కి ఒరిగేదేమిటి ?
- సెప్టెంబర్‌లో విడుదల కానున్న కార్లు మరియు బైకులు ఇవే...!!


Click it and Unblock the Notifications








