మళ్లీ ప్రకంపనలు సృష్టించడానికి సిద్దమైన హ్యుందాయ్ శాంట్రో

By Anil

ఆధునిక పోకడల మీద మక్కువతో పాత కాలం నాటి కార్లకున్న డిమాండ్ నానాటికీ తగ్గిపోయింది. కొన్ని కార్లు అయితే ఏకంగా మార్కెట్ నుండి వైదొలగాయి. అందులో ఒకటి హ్యుందాయ్ మోటార్స్‌కు చెందిన శాంట్రో. హ్యందాయ్ మోటార్స్ సెప్టెంబర్ 23, 1998 న తమ మొదటి ఉత్పత్తి శాంట్రోతో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించింది. అతి కొద్ది కాలంలోనే భారీ అమ్మకాలను సాధించి మంచి విజయాన్ని సాధించింది.

2018 హ్యుందాయ్ శాంట్రో

కొత్త ఉత్పత్తుల రాకతో రెండేళ్ల క్రితం శాంట్రోని మార్కెట్ నుండి తప్పించింది. అయితే అప్పటి శాంట్రో ద్వారా అందుకొన్న విజయాన్ని అలాగే కొనసాగించాలని శాంట్రో సెకండ్ జెన్‌ను విడుదల చేయడానికి సిద్దమయ్యింది హ్యుందాయ్ మోటార్స్. దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనాన్నిపూర్తిగా చదవాల్సిందే.

2018 హ్యుందాయ్ శాంట్రో

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాహన పరిశ్రమలు మరియు ఆటోమొబైల్ వార్తా వేదికలు ఈ సరికొత్త 2018 శాంట్రో గురించి ఆధారం లేని వార్తలను వెలువరిస్తున్నాయి. దిగ్గజ సమాచార వర్గాల కథనం మేరకు 2018 నాటికి రెండవ తరం శాంట్రోను హ్యుందాయ్ అందుబాటులోకి తీసుకురానుంది.

2018 హ్యుందాయ్ శాంట్రో

హ్యుందాయ్ మోటార్స్ ఈ రెండవ తరానికి చెందిన 2018 శ్యాంట్రో కారుకి "ఎహెచ్" అనే కోడ్ పేరును కూడా ఖరారు చేసినట్లు తెలిసింది.

2018 హ్యుందాయ్ శాంట్రో

హ్యుందాయ్ మోటార్స్ ఈ రెండవ తరం శాంట్రోని దేశీయంగా ఉత్పత్తి చేసి అంతర్జాతీయంగా ఎగుమతి చేయనుంది. ప్రారంభంలో దేశీయంగా శాంట్రో ద్వారా విజయాన్ని అందుకున్న హ్యుందాయ్ ఇప్పుడు రెండవ తరం శాంట్రో ద్వారా మరో విస్పోటనం సృష్టడానికి సిద్దమైంది.

2018 హ్యుందాయ్ శాంట్రో

దేశీయంగా చిన్న కార్ల సెగ్మెంట్లో అగ్ర భాగంలో ఉన్న రెనో క్విడ్, డాట్సన్ రెడి గో మరియు మారుతి సుజుకి ఆల్టో 800 వంటి వాటికి హ్యుందాయ్ వారి నెక్ట్స్ జెన్ 2018 శాంట్రో గట్టి పోటీగా నిలవనుంది.

2018 హ్యుందాయ్ శాంట్రో

అన్నింటిని వెనక్కి నెట్టడానికి దీనికి ఉన్న ముఖ్య కారణాల్లో ఇంజన్ ఒకటని చెప్పవచ్చు. ఇది 800సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో రానుంది.

2018 హ్యుందాయ్ శాంట్రో

రెండవ తరానికి చెందిన ఈ 2018 శాంట్రోలో ఇయాన్‌లో వినియోగించిన ఇంజన్‌ను కూడా ఉపయోగించుకోనున్నారు. తద్వారా నిర్ణీతమైన ధర శ్రేణిలో దీనిని విడుదల చేయవచ్చు.

2018 హ్యుందాయ్ శాంట్రో

ఈ 2018 శాంట్రోలో ప్రారంభంలో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అందివ్వనున్నారు.

2018 హ్యుందాయ్ శాంట్రో

2018 హ్యుందాయ్ శాంట్రో

2018 హ్యుందాయ్ శాంట్రో

2018 హ్యుందాయ్ శాంట్రో

2018 హ్యుందాయ్ శాంట్రో

  • ఏ రిస్కు లేకుండా కారు భీమా చేసుకోండి.... పూర్తి వివరాలకు !!

Most Read Articles

English summary
Hyundai To Launch Next-Gen Santro In Global Markets By 2018
Story first published: Friday, September 16, 2016, 15:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X