టోల్ రద్దును డిసెంబర్ 1, 2016 వరకు పొడగింపు

Written By:

జాతీయ రహదారుల సాధికారక సంస్థ (NHAI) దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్లల వద్ద టోల్ ట్యాక్స్ రద్దును డిసెంబర్ 1, 2016 వరకు పొడగించింది. అయితే గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం నవంబర్ 24, 2016 వరకు టోల్ ట్యాక్స్ వసూలు చేయరాదని NHAI ఆదేశించిన విషయం తెలిసిందే. పాత రూ.500 మరియు రూ. 1000 నోట్ల రద్దు నేపథ్యంలో టోల్ కలెక్షన్ కేంద్రాల వద్ద చిల్లర సమస్యలు భారీగా తలెత్తున్న నేపథ్యంలో మరో సారి టోల్ ట్యాక్స్ రద్దును కేంద్రం పొడగించింది.

డిసెంబర్ 31, 2016 వరకూ వాహనాదారులు టోల్ గేట్ల వద్ద ట్యాక్స్ చెల్లించనవసరం లేదు. నోట్ల రద్దు చేసిన సమయం నుండి ఇప్పటి దాకా ఇలా టోల్ పన్ను రద్దు చేయడం ఇది నాలుగవసారి. టోల్ సుంకాన్ని రద్దు చేసిన తరువాత ట్రాఫిక్ కాస్త అదుపులోకి వస్తోంది.

తక్కువ ధర చెల్లింపులు ఉన్న ప్రదేశాల్లో పెద్ద నోట్లను చాలా వరకు అంగీకరించడం లేదు. తద్వారా చిన్న చిన్న అవసరాలకు పెద్ద నోట్లను వినియోగించుకోలేక మరియు చిన్న నోట్ల లభ్యత తక్కువగా ఉండటం వలన ఇబ్బందిపడుతున్న ప్రజలు ఇప్పటీ నోట్ల రద్దు అంశంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

మరీ ముఖ్యంగా జాతీయ రహదారుల్లో లారీ మరియు ట్రక్కు డైవర్లపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్లే లారీ డైవర్లు రోజూ వారి అవసరాలకు తగినంత డబ్బును సరైన సమయంలో ఏటిఎం ల నుండి పొందలేకపోతున్నారు.

ప్రస్తుతం ఏటిఎం ల నుండి రూ. 2,000 మరియు రూ. 500 ల నోట్లతో పాటు రూ. 100 నోట్లు కూడా చాలా తక్కువ పరిమాణంలో ఏటిఎమ్ కేంద్రాలలో లభిస్తున్నాయి.

 

English summary
NHAI To Not Collect Toll Tax Pan India, Demonetization Effect
Please Wait while comments are loading...

Latest Photos