పెట్రోల్ మరియు డీజల్ మీద వరుసగా రూ. 1, 2 లు తగ్గిన ధరలు

Written By:

ఆగష్టు 15, 2016 న యావత్త్ భారత్ మొత్తం 70 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంది. అయితే ఈ రోజు సామాన్య భారతీయులకు శుభవార్తను తీసుకువచ్చింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్ మీద రూ. 1 లు మరియు డీజల్ మీద రూ. 2 లు తగ్గాయి.


జూలై ప్రారంభం నుండి ఇంధన ధరలు తగ్గడం ఇది వరుసగా నాలుగవసారి.

ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 60.09 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 50.27 లు గా ఉన్నాయి. సవరించబడిన ఈ ధరలు ఆగష్టు 15, 2016 అర్థ రాత్రి నుండి అమలులోకి వచ్చాయి.
Also Read: రైలు ప్రయాణం ఎంతో సరదా...కాని రైలు నడిపే వారికి అదో నరకం..!!
ఇంధన ధరల తగ్గుదల గురించి స్పందిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఒసి) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అంతర్జాతీయంగా పెట్రోల్ మరియు డీజల్ ఉత్పత్పుల ధరలు తగ్గడం మరియు డాలర్ తో రుపాయి మారకం బలపడటం వంటి కారణాల రిత్యా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు తగ్గడానికి కారణం అయినట్లు ఐఒసి తెలిపింది.

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Petrol And Diesel Prices Reduced, Effective Midnight August 15, 2016
Please Wait while comments are loading...

Latest Photos