స్వల్పంగా తగ్గిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు

Written By:

రూ. 500 మరియు రూ. 1000 నోట్ల రద్దు తరుణంలో చిన్న నోట్ల జాడ అంతకంతకూ కరువైపోతోంది. కేవలం కొద్ది మొత్తంలో ఉన్న రూ. 100 మరియు దాని కన్నా తక్కువ విలువైన నోట్ల మార్పిడి చాలా వరకు తగ్గిపోయింది. దీని సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటోంది. అయితే దేశ వ్యాప్తంగా ఇంధన ధరలను తగ్గించి స్వల్ప ఊరటనిచ్చింది.

కేంద్ర ప్రభుత్వం తాజాగ సవరించిన ఇంధన ధరల్లో పెట్రోల్ మీద రూ. 1.46 మరియు డీజల్ మీద రూ. 1.53 లు తగ్గించింది. గత మూడు నెలల నుండి ఆరు సార్లు వరుసగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్ ధర నిన్నటి (నవంబర్ 15, 2016) సవరణతో స్వల్పంగా తగ్గింది.

ఇంధన ధరల సవరణల తరువాత గత రాత్రి (నవంబర్ 15, 2016) ఇంధన ధరలు ఢిల్లీలో ఇలా ఉన్నాయి. పెట్రల్ లీటర్ రూ. 66.16 మరియు డీజల్ ధర రూ. 54.88 లుగా ఉంది.

చివరి సారి జరిగిన ఇంధన ధరల సవరణల ప్రకారం లీటర్ పెట్రోల్ మీద రూ. 0.89 పైసలు మరియు లీటర్ డీజల్ మీద 0.86 పైసల వరకు పెంచడం జరిగింది.

గత మూడు నెలలుగా జరిగిన ఇంధన ధరల సవరణల్లో ఆరు సార్లు పెట్రోల్ ధరలు పెంచడం ద్వారా లీటర్ పెట్రోల్ మీద మొత్తం 7.53 రుపాయలు పెరిగింది మరియు మూడు సార్లు డీజల్ ధరలు పెంచడం ద్వారా లీటర్ డీజల్ మీద రూ. 3.90 లు పెరిగింది.

పెట్రో ధరల సవరణ గురించి "ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్" స్పందిస్తూ అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం ద్వారా దేశీయంగా ఇంధన ధరలు తగ్గించబడ్డాయని తెలిపింది.

 

English summary
Petrol Price Slashed By Rs 1.46 And Diesel By Rs 1.53 Per Litre
Please Wait while comments are loading...

Latest Photos