దేశీయంగా మిత్సుబిషికి రెనొ-నిస్సాన్ చేయూత

By Anil

రెనో మరియు నిస్సాన్ రెండు సంస్థలు భాగస్వామ్యంతో ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు చురుకుగా సాగిస్తున్నాయి. దేశీయంగానే కాకుండా ఈ రెండు సంస్థలు విదేశీయాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు దిగ్గజాలు జపాన్‌కు చెందిన మిత్సుబిషికి కాస్త తోడ్పాటును అందివ్వనున్నాయి.

దేశీయంగా మిత్సుబిషికి రెనొ-నిస్సాన్ చేయూత

ప్రస్తుతం రెనో-నిస్సాన్ భాగస్వామ్యానికి ముఖ్య కార్యనిర్వహణా అధికారిగా భాద్యతలు నిర్వర్తిస్తున్న కార్లోస్( Carlos Ghosn) మాట్లాడుతూ తమ వేదిక మీద మిత్సుబిషికి స్థానం కల్పిస్తున్నట్లు ప్రకటించాడు.

దేశీయంగా మిత్సుబిషికి రెనొ-నిస్సాన్ చేయూత

రెనో, నిస్సాన్ మరియు మిత్సుబిషి మూడు సంస్థలు కూడా విభిన్న ఆసక్తికరమైన ఉత్పత్తులను దేశీయంగా అందివ్వడానికి సర్వం సిద్దం చేసుకుంటున్నాయి.

దేశీయంగా మిత్సుబిషికి రెనొ-నిస్సాన్ చేయూత

ప్రస్తుతం రెనో-నిస్సాన్ సంస్థలు కాంపాక్ట్ ఎస్‌యువిల అభివృద్దికి ఉపయోగిస్తున్న సిఎమ్ఎప్-బి ఫ్లాట్‌ఫామ్‌ను మొదటి సారి మిత్సుబిషి కూడా వినియోగించుకోనుంది.

దేశీయంగా మిత్సుబిషికి రెనొ-నిస్సాన్ చేయూత

సిఎమ్ఎఫ్-బి వేదిక మీద అభివృద్ది పరచబడిన ఎస్‌యువిలకు మంచి ఉదాహరణ రెనో డస్టర్ మరియు నిస్సాన్ టెర్రానో అని చెప్పవచ్చు.

దేశీయంగా మిత్సుబిషికి రెనొ-నిస్సాన్ చేయూత

రెనో మరియు నిస్సాన్ సంయుక్తంగా అభివృద్ది చేసిన 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లను మిత్సుబిషి సేకరించి నూతన ఉత్పత్తులను అభివృద్ది చేసే అవకాశాలు ఉన్నాయి.

దేశీయంగా మిత్సుబిషికి రెనొ-నిస్సాన్ చేయూత

ఇండియన్ మార్కెట్లోకి మిత్సుబిషి తమ మొదటి సబ్ నాలుగు మీటర్ల పొడవున్న కాంపాక్ట్ ఎస్‌యువిని అభివృద్ది చేయనుంది.

దేశీయంగా మిత్సుబిషికి రెనొ-నిస్సాన్ చేయూత

సబ్ నాలుగు మీటర్ల పొడవున్న కాంపాక్ట్ ఎస్‌యువిని మిత్సుబిషి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే పన్ను ప్రయోజనాలను పొందే అవకాశాలను పొందుతుంది.

దేశీయంగా మిత్సుబిషికి రెనొ-నిస్సాన్ చేయూత

రెనో-నిస్సాన్ భాగస్వామ్యంతో మిత్సుబిషి అభివృద్ది చేస్తున్న మొదటి కాంపాక్ట్ ఎస్‌యువి 2018 నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

దేశీయంగా మిత్సుబిషికి రెనొ-నిస్సాన్ చేయూత

మిత్సుబిషి విడుదల చేసే తమ మొదటి ఎస్‌యువి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మారుతి సుజుకి వితారా బ్రిజా వంటి వాటికి పోటీగా నిలవనుంది.

దేశీయంగా మిత్సుబిషికి రెనొ-నిస్సాన్ చేయూత

దేశీయ మార్కెట్లో మూడు దిగ్గజ సంస్థల పరస్పర ఒప్పందంతో ముందుకు నడవడం భారతీయ వాహన పరిశ్రమలో చారిత్రాత్మకం అని చెప్పాలి. అయితే ఈ మూడు సంస్థల సమిష్టిగా అభివృద్ది చేసే అందుబాటులోకి తెచ్చే ఉత్పత్తి మీద భారీ అంచనాలే ఉన్నాయి.

.

  • సర్జికల్ స్ట్రైక్స్‌లో కీలక పాత్ర పోషించిన ధృువ్ హెలికాప్టర్ గురించి ఆసక్తికర విషయాలు
  • సరికొత్త స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసిన కవాసకి: ధర మరియు ఇతర వివరాలు

Most Read Articles

English summary
Read In Telugu: Renault-Nissan Alliance To Help Mitsubishi In India With New Products
Story first published: Tuesday, October 4, 2016, 16:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X