స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల నేడే

సిజెక్ కార్ల తయారీ సంస్థ స్కోడా నేడు ఇండియన్ మార్కెట్లోకి తమ ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయనుంది. దీని గురించి పూర్తి వివరాల కోసం...

Written By:

స్కోడా ఆటో ఇండియా దేశీయ విపణిలోకి తమ ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్‌ను నేడు ( నవంబర్ 03, 2016) విడుదల చేయనుంది. దీని విడుదలకు సంభందించిన ఏర్పాట్లన్నీపూర్తయ్యాయి.
 

స్కోడా ఆటో ఇండియా ఈ ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్ లో పూర్తిగా అభివృద్ది చేసిన ఇంటీరియర్ మరియు అప్‌డేటెడ్ డీజల్ ఇంజన్‌ను అందిస్తోంది. 2011 లో ర్యాపిడ్ మొదటి సారిగా పరిచయ అయ్యింది. భారీ మార్పులతో మొదటి సారిగా ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో నేడు పరిచయం కానుంది.

స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిప్ట్ ముందు వైపున మరింత కోణీయాకృతిలో ఉన్న హెడ్ ల్యాంప్స్ మరియు ఫ్రంట్ డిజైన్‌తో రానుంది. నూతన బంపర్ మరియు హెడ్ లైట్ల మధ్య అమర్చిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్ సీతాకోక చిలుక ఆకారంలో ఉంది.

సాంకేతికంగా స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5-లీటర్ సామర్థ్యం గల టిడిఐ డీజల్ ఇంజన్‌ పరిచయం కానుంది. దీనిని వోక్స్‌వ్యాగన్ అమియో డీజల్ సెడాన్ మరియు వెంటో మోడళ్లలో గుర్తించవచ్చు.

ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్‌లో వస్తోన్న డీజల్ ఇంజన్ సుమారుగా 110బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. గరిష్ట పవర్ ఉత్పత్తి చేయడానికి ఈ ఇంజన్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న టర్బోఛార్జర్‌ను అందించారు.

స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్‌లో అదే పాత 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఏ విధమైన మార్పులు లేకుండా అందిస్తున్నారు.

ట్రాన్స్‌మిషన్ పరంగా వినియోగదారులు దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను ఎంచుకునే అవకాశం కలదు.

ఇంటీరియర్‌ను డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీజి కలర్‌లో డిజైన్ చేశారు. ఈ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లో తాకే తెర గల ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, ఇందులో మిర్రర్ లింక్, బ్లూటూత్ సపోర్ట్ మరియు రివర్స్ కెమెరా కలదు.

స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి విడుదలైతే మారుతి సుజుకి సియాజ్, హోండా సిటి, వోక్స్‌వ్యాగన్ వెంటో, మరియు ఫియట్ లీనియా వంటి వాటికి గట్టి పోటీగా నిలవనుంది.

నిరంతరం ఆటోమొబైల్ వార్తలను తెలుగులో పొందడానికి డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి. నేడు విడుదల కానున్న స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్ కథనం త్వరలో....

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda To Launch Rapid Facelift In India Today
Please Wait while comments are loading...

Latest Photos