హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి బుకింగ్స్ ప్రారంభించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ తమ సరికొత్త క్రాసోవర్ ఎస్‌యువి హెక్సా‌కు సంభందించిన బుకింగ్స్‌ను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా టాటా షోరూమ్ ద్వారా హెక్సా ఎస్‌యువిని బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

By Anil

టాటా మోటార్స్ తమ సరికొత్త క్రాసోవర్ ఎస్‌యువి హెక్సా‌కు సంభందించిన బుకింగ్స్‌ను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా టాటా షోరూమ్ ద్వారా హెక్సా ఎస్‌యువిని బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

టాటా హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి బుకింగ్స్

టాటా హెక్సాను 11,000 రుపాయల మొత్తంతో వినియోగదారుల బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ రద్దు చేసుకుంటే చెల్లించిన బుకింగ్ మొత్తాన్ని పూర్తిగా వెనక్కి చెల్లించేస్తారు.

టాటా హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి బుకింగ్స్

చేసుకునే సమయంలో టాటా డీలర్ల వద్ద ఉన్న హెక్సా ఎస్‌యువిలను టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు. అయితే ఈ విషయాన్ని టాటా అధికారికంగా వెల్లడించలేదు. కాని డీలర్ల తమ వద్ద ఉన్న హెక్సాలతో టెస్ట్ డ్రైవ్‌కు అనుమతిస్తున్నారు.

టాటా హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి బుకింగ్స్

మరికొంత మంది డీలర్లు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకునే ఔత్సాహికులకు నవంబర్ 2016 మూడవ వారం నుండి టెస్ట్ డ్రైవ్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

టాటా హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి బుకింగ్స్

టాటా హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి 2.2-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల వారికోర్ 400 డీజల్ ఇంజన్‌తో అందుబాటులోకి వస్తోంది. ఇది సుమారుగా 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

టాటా హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి బుకింగ్స్

6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో వినియోగదారలకు ఎంచుకోదగ్గ గేర్‌బాక్స్ ఆప్షన్ కలదు.

టాటా హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి బుకింగ్స్

ఇందులో ఆటో, కంఫర్ట్, డైనమిక్ మరియు రఫ్ రోడ్ అనే విభిన్న డ్రైవింగ్ పద్దతులు కలవు, ముఖ్యంగా గుర్తించవలసిన ఫీచర్లలో అతి ముఖ్యమైనవి - క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, 7 విధానాలలో పనిచేసే రెయిన్ సెన్సింగ్ వైపర్ వంటివి ఉన్నాయి.

టాటా హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి బుకింగ్స్

హెక్సాలోని భద్రత పరమైన ఫీచర్లు - ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనుసంధానంతో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ (కొండలను దిగేటపుడు మరియు ఎక్కేటపుడు అదుపు తప్పకుండా పూర్తి స్థాయిలో నియంత్రణలో ఉండటం).

టాటా హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి బుకింగ్స్

టాటా మోటార్స్ హెక్సా క్రాసోవర్ ఎస్‌యువిని మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి వాటితో పోల్చితే తక్కువ ధరతో గట్టి పోటీగా నిలవనుంది.

టాటా హెక్సా క్రాసోవర్ ఎస్‌యువి బుకింగ్స్
  • టాటా కొత్త కారు హెక్సాను కొనుగోలు చేయడం సబబేనా ? కారణాలు...!
  • సంచలనాత్మక విజయంలో టియాగో: అంతా టాటా అదృష్టం
  • పాకిస్తాన్ కు బుజ్జగింపు చర్యలుండవు: ఇక ప్రతిదాడులే...!!

Most Read Articles

English summary
Read In Telugu: Tata Motors Begins Booking For Its Crossover SUV Hexa
Story first published: Wednesday, November 2, 2016, 15:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X