పొరుగింటి వాళ్లు కుళ్లుకోవాలన్నా.. చుట్టాలు షాక్ అవ్వాలన్నా.. ఈ బడ్జెట్ సన్‌రూఫ్ కార్లలో ఒకటి కొంటే చాలు

ఒకప్పుడు కారుకు సన్‌రూఫ్ ఉండటం అనేది కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ఫీచర్. లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తేనే గానీ ఆ వెలుగు, గాలి మనకు అందేవి కావు. కానీ, కాలం మారింది. ఇప్పుడు మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కార్ల తయారీ కంపెనీలు రూ.8 లక్షల లోపు ధరలోనే అద్భుతమైన సన్‌రూఫ్ కార్లను మార్కెట్లోకి తెచ్చాయి. మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక స్టైలిష్, బడ్జెట్ ఫ్రెండ్లీ సన్‌రూఫ్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మార్చి 31, 2026 నాటికి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ 5 బెస్ట్ ఆప్షన్లను ఓసారి పరిశీలిద్దాం.

Sunroof Cars Under 8 Lakhs Top 5 Budget Friendly Options for Your Family

1. హ్యుందాయ్ i20 (Hyundai i20)
ఫిబ్రవరి 2026లో అప్‌డేట్ అయిన తర్వాత హ్యుందాయ్ i20 ఇప్పుడు ఇండియాలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారుగా నిలిచింది. దీని మ్యాగ్నా(Magna) ట్రిమ్ నుండే సింగిల్ పేన్ సన్‌రూఫ్ ఫీచర్ లభిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది, ఇది 83hp పవర్‌ను ఇస్తుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో సన్‌రూఫ్ కావాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన ఆప్షన్. పైగా ఎక్కువ ధర గల వేరియంట్లలో వాయిస్ కమాండ్ ద్వారా సన్‌రూఫ్‌ను ఆపరేట్ చేసే వెసులుబాటు కూడా ఉంది.

Sunroof Cars Under 8 Lakhs Top 5 Budget Friendly Options for Your Family

2. టాటా పంచ్ (Tata Punch)
చిన్న సైజు ఎస్‌యూవీల్లో (Micro-SUV) తిరుగులేని రారాజుగా ఉన్న టాటా పంచ్, సన్‌రూఫ్ విషయంలోనూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీని ప్యూర్ ప్లస్ ఎస్ (Pure Plus S) వేరియంట్ పేం,ి సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.7.34 లక్షల నుంచి మొదలవుతుంది. పెట్రోల్ తో పాటు సీఎన్‌జీ (CNG) ఆప్షన్ కూడా ఉండటం దీని ప్రత్యేకత. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కావాలనుకునే వారు 120hp టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఎంచుకోవచ్చు, కానీ అది టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. భద్రతకు పెద్దపీట వేసే టాటా బ్రాండ్ నుంచి వస్తున్న ఈ కారు ఫ్యామిలీకి చాలా సురక్షితం.

Sunroof Cars Under 8 Lakhs Top 5 Budget Friendly Options for Your Family

3. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)
మీకు డీజిల్ ఇంజిన్‌తో పాటు సన్‌రూఫ్ కావాలా? అయితే టాటా ఆల్ట్రోజ్ కంటే తక్కువ ధరలో మరో ఆప్షన్ లేదు. ఆల్ట్రోజ్ ప్యూర్ ఎస్ (Pure S) ట్రిమ్ నుంచి సన్‌రూఫ్ ప్రారంభమవుతుంది, దీని ధర రూ.7.36 లక్షల నుంచి ఉంది. ఇది పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ మూడు రకాల ఇంధన ఆప్షన్లలో లభిస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 88hp పవర్ ఇస్తుంది. దీనిలో ఉండే క్రియేటివ్ ఎస్ వేరియంట్ డీజిల్ ఇంజిన్‌తో వస్తూ, ఇండియాలోనే సన్‌రూఫ్ ఉన్న అత్యంత చవకైన డీజిల్ కారుగా రికార్డు సృష్టించింది.

Sunroof Cars Under 8 Lakhs Top 5 Budget Friendly Options for Your Family

4. కియా సోనెట్ (Kia Sonet)
స్టైలిష్ లుక్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే వారికి కియా సోనెట్ బెస్ట్ ఛాయిస్. దీని HTE(O) ట్రిమ్ నుండే సింగిల్ పేన్ సన్‌రూఫ్ ఫీచర్ వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.70 లక్షల నుంచి మొదలవుతుంది. సోనెట్‌లో ఇంజిన్ ఆప్షన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. 1.2 లీటర్ పెట్రోల్ తో పాటు, వేగంగా దూసుకెళ్లే 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. టెక్నాలజీ పరంగా కియా తనదైన ముద్ర వేయడంతో యువత ఈ కారును ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

Sunroof Cars Under 8 Lakhs Top 5 Budget Friendly Options for Your Family

5. హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)
హ్యుందాయ్ నుంచి వచ్చిన మరో అదిరిపోయే సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌టర్. దీని లేటెస్ట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ద్వారా సన్‌రూఫ్ ధరను మరింత తగ్గించింది కంపెనీ. దీని HX4+ ట్రిమ్ నుంచి సన్‌రూఫ్ అందుబాటులో ఉంది, దీని ప్రారంభ ధర రూ. 7.95 లక్షలుగా ఉంది. 1.2 లీటర్ ఇంజిన్ పెట్రోల్ మోడ్‌లో 83hp, సీఎన్‌జీ మోడ్‌లో 69hp పవర్‌ను జనరేట్ చేస్తుంది. తక్కువ ధరలో మంచి గ్రౌండ్ క్లియరెన్స్, సన్‌రూఫ్ కావాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు ఇది పక్కాగా సరిపోతుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 31, 2026, 14:04 [IST]
English summary
Sunroof cars under 8 lakhs top 5 budget friendly options for your family
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+