అక్టోబర్ అమ్మకాలతో కొత్త శకాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్

అక్టోబర్ 2016 అమ్మకాల పరంగా టాటా మోటార్స్ జపాన్ దిగ్జజ కార్ల తయారీ సంస్థ హోండా కన్నా మెరుగైన ఫలితాలను సాధించింది.

By Anil

భారత దేశపు అతి పెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ లోని ప్యాసింజర్ కార్ల విభాగం ఒక కొత్త శకానికి నాంది పలికింది. అక్టోబర్ 2016 అమ్మకాల్లో హోండా మోటార్స్‌ను వెనక్కి నెట్టి టాటా భారత దేశపు నాలుగవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా నిలిచింది.

టాటా మోటార్స్ అక్టోబర్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు

టాటా మోటార్స్ గడిచిన అక్టోబర్ 2016 లో ఏకంగా 16,311 యూనిట్ల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు జరిపి 28 శాతం వృద్దితో భారత దేశపు నాలుగవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా నిలిచింది.

టాటా మోటార్స్ అక్టోబర్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు

భారీ స్థాయిలో వృద్దిని సాధించడానికి కారణం టాటా వారి స్మాల్ హ్యచ్‌బ్యాక్ టియాగో ప్రధాన కారణం. ఒకే నెలలో రెండు ప్రధాన పండుగల రావడం వలన అధిక సంఖ్యలో టియాగో అమ్మకాలు నమోదయ్యాయి.

టాటా మోటార్స్ అక్టోబర్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు

హోండా మోటార్స్ గడిచిన అక్టోబర్ 2016 లో 15,567 యూనిట్ల అమ్మకాలు జరిపి 23 శాతం వృద్దిని కోల్పోయి ఐదవ స్థానానికి పరిమితం అయ్యింది. గత ఏడాది ఇదే మాసంలో హోండా 20,166 యూనిట్లు అమ్మకాలు జరిపింది.

టాటా మోటార్స్ అక్టోబర్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు

టాటా వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా క్రమంగా మెరుగుపడుతున్నాయి. అక్టోబర్ 2016 లో 88,976 యూనిట్ల అమ్మకాలతో 15 శాతం వృద్ది నమోదైంది.

టాటా మోటార్స్ అక్టోబర్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు

దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతులలో కూడా మంచి ఫలితాలు నమోదయ్యాయి. టాటా వాహనాల ఉత్పత్తుల్లో 39 శాతం వృద్ది నమోదయ్యి 6,333 యూనిట్లు ఎగుమతి అయ్యాయి.

టాటా మోటార్స్ అక్టోబర్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు

టాటా మోటార్స్ ఈ టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను ఏప్రిల్ మొదటి వారంలో దేశీయ విపణిలోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తుండటంతో టియాగో అమ్మకాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి.

టాటా మోటార్స్ అక్టోబర్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు

టాటా మోటార్స్ టియాగో హ్యాచ్‌బ్యాక్‌ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంది. ఇందులోని 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల రివట్రాన్ మల్టీ డ్రైవ్ పెట్రోల్ ఇంజన్ సుమారుగా 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

టాటా మోటార్స్ అక్టోబర్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు

టియాగోలోని మరో ఇంజన్ ఆప్షన్ 1050 సీసీ సామర్థ్యం ఉన్న రివోటార్క్ మల్టీ డ్రైవ్ కామన్ రెయిల్ డీజల్ ఇంజన్. మూడు సిలిండర్లు గల ఈ ఇంజన్ సుమారుగా 69బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

టాటా మోటార్స్ అక్టోబర్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు

టాటా టియాగో పెట్రోల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.21 లక్షలు మరియు టియాగో డీజల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 3.95 లక్షలు, రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

టాటా మోటార్స్ అక్టోబర్ ప్యాసింజర్ కార్ల అమ్మకాలు

  • ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు
  • ధరకు తగ్గ విలువతో విడుదలైన 2016 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్
  • ఈ హెలికాప్టర్ మానవ రహిత విహంగ వాహనాలతో మాట్లాడుతుంది

Most Read Articles

English summary
Read In Telugu: Tata Motors Displaces Honda As 4th Largest Carmaker In India — Start Of A New Era?
Story first published: Friday, November 4, 2016, 13:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X