ఉత్పత్తికి సిద్దమైన టాటా నెక్సాన్‌కు పరీక్షలు: అతి త్వరలో విడుదల

By Anil

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్న ఉత్పత్తులు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఈ ఏడాదిలో అందుబాటులోకి వచ్చిన టియాగో మరియు అంతకు ముందు వచ్చిన జెస్ట్ రెండు కూడా మంచి ఫలితాలను సాధించాయి. ఇదే ఊపు మీద టాటా మరో ఉత్పత్తిని నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువిని విడుదల చేయడానికి సిద్దమయ్యింది.

టాటా తమ అప్ కమింగ్ కాంపాక్ట్ ఎస్‌యువిని మహారాష్ట్రలో అత్యంత రహస్యంగా పరీక్షించింది. పరీక్షలకు తీసుకు వచ్చిన వాహనంలో ఇంతుకు మునుపు 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన నెక్సాన్‌తో పోల్చితే దాదాపు ప్రొడక్షన్ రెడి మోడల్‌గా దర్శనమిస్తోంది.

ఉత్పత్తికి సిద్దమైన టాటా నెక్సాన్‌కు పరీక్షలు

పరీక్షల్లో బాగంగా దొరకిన రహస్యం ఫోటోలోని వెనుక భాగాన్ని పరిశీలిస్తే డ్యూయల్ టోన్ రంగులో ఉన్న సిల్వర్ బాడీ కనిపిస్తోంది. అయితే రియర్ వైపర్‌ను అందివ్వలేదు. మిర్రర్‌కు దిగువ వైపున బ్లాక్ స్ట్రిప్‌ను గుర్తించవచ్చు.

ఉత్పత్తికి సిద్దమైన టాటా నెక్సాన్‌కు పరీక్షలు

విడుదల కాబోయే నెక్సాన్‌లో 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, డ్యూయల్ పాత్ సస్పెన్షన్ మరియు 200ఎమ్ఎమ్ ఎత్తు పొడవైన గ్రౌండ్ క్లియరెన్స్ కలదు.

ఉత్పత్తికి సిద్దమైన టాటా నెక్సాన్‌కు పరీక్షలు

ఇంటీరియర్ పరంగా ఇందులో 6.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డ్రైవ్ మోడ్‌ను ఎంచుకునే అవకాశం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ల్పే కలదు.

ఉత్పత్తికి సిద్దమైన టాటా నెక్సాన్‌కు పరీక్షలు

సాంకేతికంగా టాటా మోటార్స్ ఇందులో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బోఛార్జ్‌డ్ రివోటార్క్ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తున్నారు. ఇది సుమారుగా 110బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఉత్పత్తికి సిద్దమైన టాటా నెక్సాన్‌కు పరీక్షలు

ట్రాన్స్‌మిషన్ పరంగా ఇందులోని ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అందించే అవకాశాలు ఉన్నాయి.

ఉత్పత్తికి సిద్దమైన టాటా నెక్సాన్‌కు పరీక్షలు

టాటా మోటార్స్ ఈ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువిని అందుబాటులోకి తీసుకువస్తే ముఖ్యంగా మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ వారి ఎకో స్పోర్ట్ వాహనాలకు పోటీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

ఉత్పత్తికి సిద్దమైన టాటా నెక్సాన్‌కు పరీక్షలు

హ్యాట్సాఫ్ టు ఇండియన్ ఆర్మీ: చైనాకు ముప్పు తిప్పలు పెడుతున్న భారతీయ సైన్యం

ఇండియాలోని ఈ రైల్వే స్టేషన్లకు వెళ్లే వారు జర భద్రం

Most Read Articles

English summary
Production Version Tata Nexon Spotted Testing On Road
Story first published: Monday, August 29, 2016, 18:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X