జెనాన్ ఫేస్‌లిఫ్ట్ ను 2017 నాటికి విడుదల చేయనున్న టాటా మోటార్స్
టాటా మోటార్స్ తమ జెనాన్ పికప్ ట్రక్కును 2017 లో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయనుంది. పూర్తి వివరాలు...
టాటా మోటార్స్‌కు చెందిన పికప్ ట్రక్కు జెనాన్ గుర్తుతుందా..? విడుదలైనప్పటి నుండి సరికొత్త సొబగులతో మళ్లీ విడుదలవ్వడానికి ఎంతో కాలం నుండి వేచి చూస్తోంది. అయితే ఎట్టకేలకు టాటా మోటార్స్ ఈ జెనాన్ పికప్ ట్రక్కును 2017 నాటికి ఫేస్‌లిప్ట్ రూపంలో విడుదల చేయడానికి సిద్దమైంది.

జపాన్‌కు చెందిన ఇసుజు మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి డి-మ్యాక్స్ వి-క్రాస్ ఎస్‌యువిని ప్రవేశపెట్టేసరికి టాటా జెనాన్‌కు పోటీ తీవ్రమైంది. అయితే ఫేస్‌లిఫ్ట్ రూపంలో జెనాన్ ని విడుదల చేస్తే పోటీని కాస్త అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం టటా మోటార్స్ నుండి 2017 నాటికి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జెనాన్ పికప్ విడుదల ఖాయం అనేది స్పష్టమవుతోంది. మరియు ఫేస్‌లిఫ్ట్ జెనాన్ ఇప్పటికే పలుమార్లు రహస్యం పరీక్షలకు కూడా గురైంది.

ఫేస్‌లిఫ్టెడ్ జెనాన్ లో ట్రాన్స్‌మిషన్ పరంగా స్వల్పంగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే ఇంజన్ పరంగా అదే 2.2-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌తో రానుంది.

అయితే టాటా జెనాన్ ఫేస్‌లిఫ్ట్ లో వినియోగించనున్న ఈ ఇంజన్ గరిష్టంగా 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

త్వరలో టాటా మోటార్స్ విడుదల చేయనున్న టాటా హెక్సా ఎస్‌యువిలో అందివ్వనున్న 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ను ఇందులో కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.

టాటా మోటార్స్ ప్రారంభంలో సింగల్ క్యాబిన్ గల జెనాన్ వేరియంట్‌ను 8 లక్షల రుపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది. తరువాత డబుల్ ప్యాసింజర్ క్యాబిన్ గల వేరియంట్ ను కూడా విడుదల చేసింది.

జెనాన్ టూ వీల్ డ్రైవ్ వేరియంట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 9.02 లక్షలు మరియు ఫోర్ వీల్ డ్రైవ్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 11 లక్షలు. రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకు సిద్దమైన జెనాన్‌లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, బాడీ కలర్ లో ఉన్న అప్‌డేటెడ్ ఫ్రంట్ బంపర్ వంటి వాటిని గుర్తించవచ్చు.

సరికొత్త టాటా జెనాన్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ మరియు మహీంద్రా స్కార్పియో గేట్‌వే వంటి వాటికి గట్టి పోటీని సృష్టించనుంది.

- టాటా హెక్సా ఎస్‌యువి బుకింగ్స్ ప్రారంభం
- టాటా నానో సింగూరు ప్లాంటు విషయంలో తప్పెవరిది ?
- టాటా కైట్ 5 భారీ విజయాన్ని సాధించడానికి ఉన్న ముఖ్య కారణాలు..?


Click it and Unblock the Notifications








