రహస్యంగా విడుదలైన 2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్

Written By:

2017 హోండా సిటి ఫేస్‌లిఫ్ట్ విడుదలను సూచించే విధంగా హోండా ఇప్పటికే పలుమార్లు ఈ అప్ కమింగ్ సెడాన్ కారుకు సంభందించిన టీజర్ ఫోటోలను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సిటి సెడాన్‌కు ఇండోనేషియాలో పలుమార్లు రహస్యంగా అనేక అంశాల పరంగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది.

జపాన్ ఆధారిత దిగ్గజ కార్ల తయారీ సంస్థ హోండా ఈ ఏడాది దేశీయ విపణిలోకి విడుదల చేయనున్న సిటి సెడాన్ కు సంబంధించిన ప్రకటనలను షూటింగ్ చేస్తోంది. ఈ తరుణంలో ఇలా teamBHP వెబ్‌సైట్ వారి కెమెరా కంటికి చిక్కింది.

డిజైన్ పరంగా ఈ నూతన సిటి సెడాన్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యనే విడుదలైన సివిక్ సెడాన్ ప్రేరిత డిజైన్ లక్షణాలను ఇందులో గమనించవచ్చు. హెడ్ ల్యాంప్, టెయిల్ లైట్ క్లస్టర్‌ లో స్వల్ప మార్పులతో పాటు ముందు వైపున పెద్ద క్రోమ్ బార్ కలదు.

ఇరు వైపులా ఉన్న రెండు హెడ్ ల్యాంప్స్ అనుసంధానం చేస్తూ ఈ క్రోమ్ పట్టీ కలదు. ఈ రూపాన్ని అచ్చం సివిక్ సెడాన్ లో గుర్తించవచ్చు. ఇక ముందు వైపున పెద్ద ఫాగ్ ల్యాంప్స్ ఇముడింపజేసిన రీ డిజైన్డ్ ఫ్రంట్ బంపర్ కలదు.

హోండా మోటార్స్ ఈ ఫేస్‌లిఫ్టెడ్ సెడాన్ లోని వెనుక వైపు డిజైన్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. స్పోర్టివ్ ఆకృతిలో తీర్చిదిద్దిన టెయిల్ లైట్, రియర్ స్టాప్ లైట్ మరియు స్పాయిలర్ ఇముడింపుతో ఉన్న బూట్ లిడ్ (డిక్కీ) అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

2017 హోండా ఫేస్‌లిఫ్ట్ సిటి సెడాన్ మోడల్‌లో ప్రస్తుతం సిటి సెడాన్‌లో ఉన్న అదే 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు రానున్నాయి.

హోండా మోటార్స్ ఈ 2017 ఫేస్‌లిఫ్ట్ సిటి సెడాన్‌ను జనవరి 12, 2017 న అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇది విపణిలోకి ప్రవేశిస్తే ప్రస్తుతం ఉన్న మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, వోక్స్‌వ్యాగన్ వెంటో మరియు స్కోడా ర్యాపిడ్ వంటి ప్రీమియమ్ సెడాన్‌లకు గట్టి పోటీనివ్వనుంది.

పాకిస్తాన్ కు దిమ్మతిరిగింది....!!
సోమవారం (09/01/2017) నాడు హిందూ మహాసముద్రం నుండి జలాంతర్గామి సాయంతో ప్రయోగించిన బాబర్-3 అణుక్షిపణి అంతా బూటకమే అని నిపుణులు తేల్చితెబుతున్నారు.

విడుదలైనప్పటి నుండి ఇండియాలో భారీ విక్రయాలు నమోదు చేసుకున్న భారత సామాన్య జనప్రియ కారు స్విప్ట్‌ను 2017 వెర్షన్‌గా మూడవ తరం స్విఫ్ట్‌గా ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి విడుదలవుతోంది. జపాన్ డిజైన్ శైలిలో వస్తోన్న దీనిని చూడాలనుకుంటే ఇక్కడున్న గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

 

Story first published: Wednesday, January 11, 2017, 19:36 [IST]
English summary
India-Bound 2017 Honda City Facelift Spied During Ad Shoot
Please Wait while comments are loading...

Latest Photos