హైబ్రిడ్ పరిజ్ఞానంతో వస్తోన్న 2017 హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ మోటార్స్ ఈ ఏడాదిలో క్రెటా ఎస్‌యూవీని మిల్డ్ హైబ్రిడ్ సాంకేతిక పరిజ్ఞానంతో, స్వల్ప కాస్మొటిక్ మార్పులతో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమచారం. పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో....

By Anil

దక్షిణ కొరియా ఆధారిత దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ పాపులర్ ఎస్‌యూవీ క్రెటా ను మిల్డ్ హైబ్రిడ్ సాంకేతిక పరిజ్ఞానంతో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నూతన క్రెటా ఎస్‌యూవీ స్వల్ప కాస్మొటిక్ మార్పులతో రానుంది.

2017 హ్యుందాయ్ క్రెటా

గత ఏడాది నవంబర్‌లో జరిగిన Sao Paulo అంతర్జాతీయ వాహన ప్రదర్శన వేదిక మీద ఆవిష్కరించిన క్రెటా కన్నా విభిన్నంగా ఉండనుంది. అయితే దీని విడుదల ఈ ఏడాదిలోనే ఉన్నట్లు సమాచారం.

2017 హ్యుందాయ్ క్రెటా

భారత మార్కెట్లో కంటే ముందుగా బ్రెజిల్ విపణలోకి విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి దేశీయంగా ఉన్న క్రెటా కు స్వల్ప మార్పులు చేర్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్‌గా హైబ్రిడ్ పరిజ్ఞానంతో విడుదల చేసే అవకాశం ఉంది.

2017 హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యువిలో హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని పరిచయం చేయడం ద్వారా మైలేజ్ గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం మారుతి తమ సియాజ్ సెడాన్‌లో ఈ టెక్నాలజీని అందించింది.

2017 హ్యుందాయ్ క్రెటా

సాంకేతికంగా 2017 క్రెటా ఎస్‌యూవీ 1.6-లీటర్ విటివిటి పెట్రోల్, 1.4-లీటర్ సిఆర్‌డిఐ డీజల్ మరియు 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న సిఆర్‌డిఐ డీజల్ ఇంజన్ వేరియంట్లలో రానుంది. ఈ ఇంజన్ ఆప్షన్లకే మిల్డ్ హైబ్రిడ్ అనుసంధానం చేయనుంది.

2017 హ్యుందాయ్ క్రెటా

2017 క్రెటా హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులోకి వస్తే ఎఫ్ఏఎమ్ఇ స్కీమ్ క్రింద కేంద్ర ప్రభుత్వం అందించే ప్రయోజనాలను ఇటు తయారీదారుడు మరియు కొనుగోలుదారుడు పొందే అవకాశం ఉంది.

2017 హ్యుందాయ్ క్రెటా

తక్కువ ఉద్గారాలను ఉత్పత్తి చేసే వాహనాల తయారీ, అభివృద్ది మరియు కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్సం ఇన్సెటివ్స్ అందిస్తోంది.

2017 హ్యుందాయ్ క్రెటా

ఈ అంబాసిడర్ కారు వయస్సు 29 ఏళ్లు

ఇండియాలో ఆ టైర్లను కలిగి ఉన్న ఏకైక కారు

రిపబ్లిక్ డే గెస్ట్: అబుదాబి రాజు గారి ఆడంబరమైన విమానం

Most Read Articles

English summary
2017 Hyundai Creta With Mild-Hybrid Technology To Be Launched In India
Story first published: Saturday, January 28, 2017, 16:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X