2017 గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ విడుదల ధర రూ. 4.58 లక్షలు

Written By:

దక్షిణ కొరియాకు చెందిన ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ ఇండియా విభాగం దేశీయ విపణిలోకి తమ 2017 గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. దీని ధరల శ్రేణి రూ. 4.58 లక్షల నుండి 6.40 లక్షల మధ్య ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.

గత ఏడాది ప్యారిస్‌లో జరిగిన వాహన ప్రదర్శన వేదిక మీద హ్యుందాయ్ మోటార్స్ ఈ ఫేస్‌లిఫ్ట్ గ్రాండ్ ఐ10 మోడల్‌ను మొదటి సారిగా ఆవిష్కరించిదంది.

ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోల్చుకుంటే 2017 గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ లో ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌తో పాటు ఇంజన్ పరంగా కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. కాస్మొటిక్ సొబగులకు కూడా హ్యుందాయ్ ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చింది.

డిజైన్

2017 గ్రాండ్ ఐ10 ఫ్రంట్ డిజైన్‌లో హెక్సా గోనల్ ఆకారంలో ఉన్న తేనె తుట్టెను తలపించే ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల ఇముడింపుతో నూతన ఆకృతిలో ఉన్న హెడ్ ల్యాంప్స్ కలవు.

ఎక్ట్సీరియర్ డిజైన్

నూతన గ్రాండ్ ఐ10 లో క్రోమ్ పూత పూయబడిన డోర్ హ్యాండిల్స్, వెనుక వైపు అద్దం మీద వైపర్, స్టాప్ ల్యాంప్ గల రూఫ్ స్పాయిలర్, రీ డిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్, ఈ హ్యాచ్‌బ్యాక్‌ను మరింత స్పోర్టివ్‌గా తీర్చిదిద్దేంకు ముందు మరియు వెనుక వైపున రీ డిజైన్ చేయబడిన బంపర్లు కలవు.

ఫీచర్లు

2017 గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్‌ ఇంటీరియర్‌లో దాదాపుగా నూతన ఫీచర్లు పరిచయం అయ్యాయి. అందులో, 7-అంగుళాల పరిమాణం తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (మధ్య మరియు టాప్ ఎండ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది), అప్‌డేటెడ్ డిజిటల్ ఎమ్‌ఐడి మరియు మూడు స్పోక్స్ గల మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ కలదు.

ఫీచర్లు

ఇంకా గుర్తించదగిన ఫీచర్లలో, ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూవ్ మిర్రర్, క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏలి వెంట్స్, ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ మరియు మలిపే వీలున్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ కలవు.

డీజల్ ఇంజన్

సాంకేతికంగా హ్యుందాయ్ మోటార్స్ ఈ గ్రాండ్ ఐ10 ఫేస్‌లిప్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న నూతన యు2 సిఆర్‌డిఐ డీజల్ ఇంజన్‌ను అందించింది. ఇది గరిష్టంగా 75బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును. మునుపటి డీజల్ వేరియంట్‌తో పోల్చుకుంటే ఇది ఉత్తమ మైలేజ్ ఇవ్వగలదు.

పెట్రోల్ ఇంజన్

హ్యుందాయ్ మోటార్స్ ఇందులో 85బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌ను కూడా అందించింది.

ట్రాన్స్‌మిషన్ వివరాలు

2017 గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆప్షనల్‌గా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించును. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభించును.

ధరలు

2017 గ్రాండ్ ఐ10 ఫేస్‌లిఫ్ట్ ధరల శ్రేణి రూ. 4.58 లక్షల నుండి రూ. 6.40 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ వేరియంట్ కన్నా 30,000 రుపాయల తక్కువ ధరతో అందుబాటులోకి వచ్చింది మరియు టాప్ ఎండ్ డీజల్ వేరియంట్ ధర మునుపటి వేరియంట్ కన్నా కాస్త ఎక్కువగా ఉంది.

పోటీ

ప్రస్తుతం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో, టాటా టియాగో, నిస్సాన్ మైక్రా మరియు హోండా బ్రియో వంటి మోడళ్లకు బలమైన పోటీనివ్వనుంది. మరిన్ని తాజా ఆటోమొబైల్ కథనాల కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు...

Story first published: Monday, January 30, 2017, 11:20 [IST]
English summary
2017 Hyundai Grand i10 Facelift Launched In India; Priced At Rs 4.58 lakh
Please Wait while comments are loading...

Latest Photos