2017 ఐ30 వ్యాగన్ ఆవిష్కరించిన హ్యుందాయ్ మోటార్స్

Written By:

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ 2017 ఐ30 వ్యాగన్ కారును 2017 జెనీవా వాహన ప్రదర్శన వేదిక మీద తొలిపరిచయానికి సిద్దం చేస్తోంది. అయితే దీనికంటే ముందుగా హ్యుందాయ్ అధికారికంగా 2017 ఐ30 వ్యాగన్ ను ఆవిష్కరించింది.

2017 ఏడాది మలిసగం చివరి నాటికి అమ్మకాలు సిద్దం చేయనున్న దీనిని మార్చి 2017 లో జరగనున్న జెనీవా ప్రదర్శన వేదిక మీద ప్రపంచ ఆవిష్కరణకు రానుంది.

హ్యుందాయ్ లైనప్‌లో విశాలమైన క్యాబిన్ గల కార్లలో ఒకటి ఐ30 వ్యాగన్. ఇదే సెగ్మెంట్లో ఉన్న ఫోర్డ్ ఫోకస్ ఎస్టేట్ మరియు వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

హ్యుందాయ్ ఐ30 వ్యాగన్ ఎక్ట్సీరియర్ డిజైన్‌ను పరిశీలిస్తే, ముందుగా దీని ఎటవాలుగా ఉండే రూఫ్ టాప్ మీదకు చూపు మరలుతుంది. ఏటవాలు రూఫ్ టాప్ ఇది కూపేలా కనబడుతుంది. ఈ ఐదు డోర్ల హ్యాచ్‌బ్యాక్ ఫ్రంట్ డిజైన్ అచ్చం మునుపటి తరం ఐ30 ని పోలి ఉంది.

2017 ఐ30 వ్యాగన్ హ్యాచ్‌బ్యాక్‌ ఇంటీరియర్‌లో ప్రధానంగా గుర్తించే మార్పులలో ఒకటి 5-అంగుళాల పరిమాణం ఉన్న తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ స్థానంలో 8-అంగుళాల పరిమాణంతో ఉంది, ఇది ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో లను సపోర్ట్ చేస్తూ స్మార్ట్ ఫోన్‌లకు వైర్ లెస్ ఛార్జింగ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటి కలదు.

సాంకేతిక అంశానికి వస్తే, 2017 ఐ30 వ్యాగన్ నాలుగు ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉండనుంది. అవి,

  • 1.0-లీటర్ మూడు సిలిండర్ల టి-జిడిఐ పెట్రోల్
  • 1.4-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్
  • 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న రెండు డీజల్ ఇంజన్‌లు (ఒకే సామర్థ్యంతో రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేయును)

హ్యుందాయ్ మోటార్స్ 2017 ఐ30 వ్యాగన్ కారులో భద్రత పరంగా డ్రైవర్ అసిస్ట్ ప్రోగ్రామ్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు లేన్ కీపింగ్ అసిస్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లను పరిచయం చేసింది.

అదనపు సేఫ్టీ విషయానికి వస్తే, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, హ్యుందాయ్ ఫస్ట్ డ్రైవర్ అటెన్షన్ మానిటరింగ్ సిస్టమ్ వంటి వాటిని కల్పించారు.

హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌లో ఉన్న 2017 ఐ30 మార్చి 2017 నుండి ప్రపంచ విపణిలో అమ్మకాలకు సిద్దం కానుంది. మరియు ఐ30 వ్యాగన్ వేరియంట్‌ను జెనీవా వాహన ప్రదర్శన అనంతరం 2017 మలిసగంలో విక్రయాలకు సిద్దం చేయనున్నట్లు సమాచారం.

హ్యుందాయ్ మోటార్స్ 2017 మోడల్‌కు చెందిన ఎక్జ్సిక్యూటివ్ సెడాన్ 2017 వెర్నాను ఆవిష్కరించింది. దీనిని ఫోటోలలో వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

 

English summary
2017 Hyundai i30 Wagon Revealed Ahead Of Geneva Motor Show
Please Wait while comments are loading...

Latest Photos