టయోటా నుండి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్: 2017 యారిస్

Written By:

జపాన్‌కు చెందిన ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్ జపాన్ మార్కెట్లోకి తమ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ 2017 యారిస్ ను విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్ కోసం దీనిని విట్జ్ అనే పేరుతో ప్రవేశపెట్టడం జరిగింది.

2017 యారిస్ ఫ్రంట్ డిజైన్ పూర్తిగా మారిపోయింది. మునుపటి యారిస్ తో పోల్చుకుంటే ఫ్రంట్ డిజైన్ లో నూతన బ్లాక్ గ్రిల్ కలదు. టయోటా లైనప్‌లో అగ్రెసివ్ డిజైన్ భాషలో ఉన్న ఏకైక మోడల్ అని చెప్పవచ్చు.

ఎక్ట్సీరియర్ పరంగా ముందు వైపున డ్యూయల్ భీమ్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, రీ డిజైన్ చేయబడిన ఫాగ్ ల్యాంప్స్ కలవు. ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, అల్లాయ్ వీల్స్ కలవు.

టయోటా మోటార్స్ ఈ 2017 యారిస్ హ్యాచ్‌బ్యాక్ ముందు వైపు డిజైన్‌తో పాటు వెనుక డిజైన్‌కు కూడా అధిక ప్రాధాన్యతనిచ్చింది. సమాంతరంగా ఉన్న ఎల్ఇడి టెయిల్ లైట్లు, ఉబ్బెత్తుగా ఉండేందుకు బంపర్ ను కూడా రీ డిజైన్ చేసి ఇందులో అందించింది.

2017 యారిస్ హ్యాచ్‌బ్యాక్‌ ఇంటీరియర్‌లో గుర్తించదగిన రీతిలో ఎలాంటి అప్‌డేట్స్ లేవు. అయితే కస్టమర్లకు ప్రీమియమ్ ఫీల్‌ను అందించేందుకు సీట్లు మరియు అప్ హోల్‌స్ట్రేకు స్వల్ప మార్పులను అందించింది.

2017 యారిస్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లో మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఎమ్ఐడి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, డ్యాష్ బోర్డ్ మీద సిల్వర్ రంగులో సమాచారవాహికలు మరియు న్యూ కలర్ థీమ్స్ కలవు.

2017 యారిస్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్లు మరియు 1.3-లీటర్ల సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల ఇంజన్ రూపాల్లో పాటు యారిస్ టాప్ ఎండ్ వేరియంట్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 99బిహెచ్‌పి పవర్ హైబ్రిడ్ పరిజ్ఞానంతో విడుదల కానుంది.

టయోటా మోటార్స్ ఈ సరికొత్త జనరేషన్ యారిస్ నుండి 2018 ప్రారంభం నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి బాలెనో మరియు హ్యుందాయ్ ఎలైట్ ఐ20 వంటి ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లకు గట్టి పోటీనివ్వనుంది.

రెనో క్విడ్ "లీవ్ ఫర్ మోర్ ఎడిషన్" విడుదల: పాత ధరలతోనే అందుబాటులో
రెనో ఇండియా "లీవ్ ఫర్ మోర్ ఎడిషన్" క్విడ్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. సాధారణ మోడళ్లతో పోల్చుకుంటే ఇది అనేక కాస్మొటిక్ మార్పులకు గురయ్యింది.

మార్కెట్లో బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ ఏది అడిగినపుడు మారుతి సుజుకి స్విఫ్ట్ అని సలహా ఇస్తుంటారు. అయితే ఇక సలహాలు వినకండి. ఎందుకంటే మారుతి ఈ ఏడాది తమ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను అప్‌డేటెడ్ వెర్షన్‌లో నెక్ట్స్ జెన్ స్విఫ్ట్‌గా విడుదల చేయనుంది. కాబట్టి దీని విడుదల వరకు వేచి ఉండండి. మరి ఇది ఎలా ఉంటుందో క్రింద గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి.

 

English summary
New-Generation Toyota Yaris Launched In Japan
Please Wait while comments are loading...

Latest Photos