ఆర్ఎస్ క్యూ8 కాన్సెప్ట్ ను సిద్దం చేస్తున్న ఆడి

Written By:

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఆడి కార్లకు ఉన్న ప్రత్యేకత మరియు క్రేజ్ అందిరికీ తెలిసిందే. అయితే ఆడి అతి త్వరలో జరగబోయే 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద తమ ఆర్ఎస్ క్యూ8 కాన్సెప్ట్‌ను ప్రదర్శించనుంది. ఆర్ఎస్ క్యూ8 గురించి పూర్తి వివరాలు నేటి కథనంలోతెలుసుకుందాం రండి.

2017 జెనీవా వాహన ప్రదర్శన వేదిక మీద తొలి ప్రదర్శనకు రానున్న ఆర్ఎస్ క్యూ8 ఎస్‌యూవీ కాన్సెప్ట్ గరిష్టంగా 600బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేయునుంది. ప్రస్తుతం ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్6 ఎమ్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జి జిఎల్ఇ 63 కూపే కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

ఆర్ఎస్ క్యూ8 కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఆడి స్పోర్ట్ విభాగం, క్వాట్పో జిఎమ్‌బిహెచ్ పర్ఫామెన్స్ బృందం అభివృద్ది చేసింది. ఇందులో ఆడి యొక్క 4.0-లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్ టుర్బో వి8 ఇంజన్ వచ్చే అవకాశం ఉంది.

ఆటో కార్ ఇండియా అనే వేదిక తెలిపిన కథనం మేరకు ఆడి లైనప్‌లో గల ఎస్8 ప్లస్ వేరియంట్లో ఉన్న వి8 ఇంజన్‌కు సమానమైన పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుందని తెలిపింది. అంటే 605బిహెచ్‍‌పి పవర్ మరియు 700ఎన్ఎమ్ గరిష్ట టార్క్ మనం ఆశించవచ్చు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే అవకాశం ఉంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ నాలుగు చక్రాలకు పవర్ చేరుతుంది.

బ్రిటీష్ కార్ల మ్యాగజైన్ తమ కథనం మేరకు, ఆడి స్పోర్ట్ అభివృద్ది చేసిన ఈ ఆర్ఎస్ క్యూ8 కాన్సెప్ట్ కేవలం 4 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది, మరియు దీని గరిష్ట వేగం గంటకు 300కిలోమీటర్లుగా ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా దీనికి ప్రత్యేక్షంగా నిలిచే ఉత్పత్తులైన మెర్సిడెస్ బెంజ్ యొక్క ఎస్‌యూవీ 4.3 సెకండ్లలో మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎస్‌యూవీ 4.2 సెకండ్లలో 100 కిమీల వేగాన్ని చేరుకుంటాయి. వీటితో పోల్చుకుంటే ఆడి అర్ఎస్ క్యూ8 అత్యంత వేగవంతమైనది.

ఆడి స్పోర్ట్ అత్యంత వేగవంతమైన ఆర్ఎస్ క్యూ8 ఎస్‌యూవీలో ముందు వైపున అత్యంత అగ్రెసివ్ ఫ్రంట్ డిజైన్ అందివ్వనుంది. విశాలమైన ఫ్రంట్ గ్రిల్ క్రింది భాగంలో అధునాతన ఫ్రంట్ గ్రిల్ అందివ్వడం జరిగింది. డిజైన్‌లో ఇదో విప్లవాత్మకమైన మార్పు అని చెప్పవచ్చు.

పొడవుగా మరియు తక్కువ వాలు గల రూఫ్ లైన్‌తో ఉన్న రూపాన్ని గమనించవచ్చు. పెద్ద చక్రాలకు విశాలమైన టైర్లను గుర్తించవచ్చు. ఆడి లైనప్‌లో మరే ఇతర మునుపటి వేరియంట్లలో ఈ మార్పులను గుర్తించలేము.

క్యూ8 ఎస్‌యూవీ తరహాలోనే ఉన్న ఆర్ఎస్ క్యూ8 ఇంటీరియర్ ను గమనించవచ్చు. స్పోర్టివ్ శైలిలో ఉన్న స్టీరింగ్ వీల్ మినహాయిస్తే ఇందులో మరే ఇతర మార్పులు చోటు చేసుకోలేదు.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #ఆడి #audi
English summary
Audi RS Q8 Concept Set To Debut At The 2017 Geneva Motor Show
Please Wait while comments are loading...

Latest Photos