ఇండియా కోసం బిఎమ్‌డబ్ల్యూ 1-సిరీస్ సెడాన్

Written By:

బిఎమ్‌డబ్ల్యూ కంపెనీ యొక్క మొదటి ఫ్రంట్ వీల్ సెడాన్ 1 సిరీస్ కారును దేశీయ విపణిలోకి విడుదల చేయనుంది. ఇప్పటికే ఇది చైనా మార్కెట్లో అమ్మకాలు సాగిస్తోంది. చైనాకు చెందిన బ్రిలియన్స్ ఆటోమేటివ్ లిమిటెడ్ భాగస్వామ్యంతో బిఎమ్‌డబ్ల్యూ ఈ 1 సిరీస్ కారును అభివృద్ది చేసింది.

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ సెడాన్ కారును ప్రత్యేకించి చైనా మార్కెట్ కోసం అభివృద్ది చేసింది. మరియు ఇంత వరకు దీనిని చైనాలో తప్ప మరే ఇతర అంతర్జాతీయ విపణిలోకి ప్రవేశపెట్టలేదు.

బిఎమ్‌డబ్ల్యూ డీలర్లు మరియు స్టాక్ హోల్డర్ల వద్ద ఇది తాత్కాలికంగా దర్శనమిస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ దీని విడుదల ద్వారా పెద్ద అలజడినే సృష్టంచబోతోంది.

బిఎమ్‌డబ్ల్యూ ఈ 1 సిరీస్ సెడాన్ కారును కేవలం చైనా మార్కెట్ కోసం అభివృద్ది చేయడం, చైనాలో మాత్రమే విడుదల చేయడం మరియు చైనాలో మాత్రమే ఉత్పత్తి చేయడం వంటి వివరాలను అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు.

అభివృద్ది చెందుతున్న ఇండియా వంటి మార్కెట్లలో ఈ 1 సిరీస్ సెడాన్‌కు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మరింత శక్తివంతమైన ఇంజన్ 1 సిరీస్ లో అందించి యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసే ఆలోచనలో బిఎమ్‌డబ్ల్యూ ఉంది.

ఇండియన్ మార్కెట్లో ఈ తరహా ఉత్పత్తులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్, సిఎల్ఎ సెడాన్ మరియు ఆడి ఏ3 కార్లు ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ వారి 1 సిరీస్ కారు వీటికి పోటీగా నిలిచే అవకాశం ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ సెడాన్ పొడవు 4,456ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 2,670ఎమ్ఎమ్ గా ఉంది. సిఎల్ఎ కన్నా తక్కువ ఏ3 కన్నా ఎక్కువ పొడవుగా ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్ సెడాన్ లో రెండు రకాలుగా పవర్ ఉత్పత్తి చేసే వేరియంట్లు ఉన్నాయి. అందులో 230బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల 125ఐ వెర్షన్ మరియు 190బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 120ఐ వెర్షన్ కలదు.

1 సిరీస్ సెడాన్ లో డీజల్ మోడల్ లేదు, కాకపోతే మంచి అవకాశం ఉన్న మార్కెట్లపై దృష్టిసారిస్తోన్న తరుణంలో దీనిని డీజల్ వేరియంట్లో కూడా పరిచయం చేయనుంది.

బిఎమ్‌డబ్ల్యూ దేశీయ విపణిలోకి ఈ 1 సిరీస్ సెడాన్‌ను విడుదల చేస్తే ప్రారంభ ధర రూ. 35 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉండవచ్చు.

2017 లో మార్కెట్లోకి మారుతి విడుదల చేయనున్న కార్ల వివరాలు..
మారుతి సుజుకి 2017 లో ఇండియన్ మార్కెట్లోకి భారీ సంఖ్యలో కొత్త కార్లను విడుదల చేయనుంది. ఆ కార్ల వివరాలు.....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
BMW Might Consider 1 Series Sedan For India
Please Wait while comments are loading...

Latest Photos