మహీంద్రా నుండి కెయువి100 యానివర్సరీ ఎడిషన్

Written By:

భారత దేశపు దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ క్రాసోవర్ వాహనం కెయువి100 ను యానివర్సరీ ఎడిషన్‌లో విడుదల చేయడానికి సిద్దమైంది. సరిగ్గా ఏడాది క్రితం మార్కెట్లోకి విడుదలైన కెయువి100 అమ్మకాల పరంగా భారీ విజయాన్ని అందుకుంది.

2017 మహీంద్రా కెయువి100 యానివర్సరీ అంటూ కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో సంచారం చేస్తున్నాయి. ఇది డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌తో అందుబాటులో ఉన్న లీకైన బ్రోచర్ల ద్వారా తెలుస్తోంది.

యానివర్సరీ కెయువి100 మోడల్ ప్లాంబోయంట్ రెడ్ లేదా డాజ్లింగ్ సిల్వర్ బాడీతో పాటు పూర్తిగా నల్లటి రంగులో ఉన్న రూఫ్‌తో ఇది రానున్నట్లు కొన్ని వార్తా వేదికలు చెబుతున్నాయి.

మహీంద్రాయా కెయువి100 యానివర్సరీ ఎడిషన్‌లోని కె8 వేరియంట్ 15-అంగుళాల డైనమిక్ డిజైన్ అల్లాయ్ వీల్స్, కె6 మరియు కె6+ వేరియంట్లు 14-అంగుళాల స్పైడర్ డిజైన్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉన్నాయి.

మహీంద్రా తమ కెయువి100 యానివర్సరీ ఎడిషన్‌ విడుదలతో పాటు నాలుగు స్పెషల్ యాక్ససరీ కిట్‌లను అందిస్తోంది. అవి, స్పోర్టి ఎక్ట్సీరియర్ కిట్, స్పోర్టి ఇంటీరియర్ కిట్, ప్రీమియమ్ ఎక్ట్సీరియర్ కిట్, ప్రీమియమ్ ఇంటీరియర్ కిట్.

ఈ యానివర్సరీ ఎడిషన్‌లో ఎలాంటి సాంకేతిక మార్పులు ఉండవని మహీంద్రా స్పష్టం చేసినట్లు రహస్యంగా విడుదలైన ఫోటోలు చెబుతున్నాయి. సాంకేతికంగా ఈ కెయువి100 1.2-లీటర్ సామర్థ్యం గల ఎమ్‌ఫాల్కన్ జి80 మరియు 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న ఎమ్‌ఫాల్కన్ డి75 ఇంజన్‌లు కలవు.

ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 82బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అదే విధంగా డీజల్ ఇంజన్ గరిష్టంగా 77బిహెచ్‌పి పవర్, 190ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

రెండు ఇంధన వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ అనుసంధానంతో రానున్నాయి. ఏఆర్ఏఐ ప్రకారం పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 18.15 కిమీలు మరియు డీజల్ వేరియంట్ లీటర్‌కు 25.32 కిమీల మైలేజ్ ఇవ్వగలవు.

ఎయిర్ ట్రావెల్ అంటే ఇష్టమా....? అయితే ఈ లిస్ట్‌లో ఉన్న విమానాలు మీ కోసమే

 

English summary
Brochure Leaked: Mahindra KUV100 Anniversary Edition
Please Wait while comments are loading...

Latest Photos