అమ్మకాల్లో కొత్త అంచులను తాకిన ఫోర్డ్

Written By:

ఏడాది ముగిసే సమయానికి ఫోర్డ్ ఇండియా ఏకంగా 38.83 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. గత ఏడాది ఫిబ్రవరి అమ్మకాలతో 2017 ఫిబ్రవరి అమ్మకాలను పోల్చితే ఈ ఆశ్చర్యకరమైన గణాంకాలు బయటకు వచ్చాయి.

ఫోర్డ్ ఇండియా ఫిబ్రవరి 2017 లో దేశవ్యాప్తంగా 24,026 కార్లను విక్రయించింది (దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు కలుపుకొని), అయితే గత ఏడాది ఇదే మాసంలో 17,306 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే మాసం యొక్క దేశీయ అమ్మకాల్లో 52 శాతం మరియు ఎగుతులు 32.69 శాతం వృద్దిన నమోదు చేసుకుంది.

ఫోర్డ్ మోటార్స్ గడిచిన ఫిబ్రవరిలో దేశీయంగా 8,338 వాహనాలను విక్రయించింది, మరియు 15,688 యూనిట్లను ఎగుమతి చేసింది. అయితే గత ఏడాది ఫిబ్రవరిలో దేశీయంగా 5,483 యూనిట్లను విక్రయించగా, 11,823 యూనిట్లను ఎగుమతి చేసింది.

ఫోర్డ్ ఫలితాలను వెల్లడించిన సంధర్బంలో కంపెనీ మార్కెటింగ్, సేల్స్ మరియు సర్వీస్ ఎక్జ్సిక్యూటివ్ డైరెక్టర్, అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ, "నాణ్యత, లో సర్వీస్ కాస్ట్ మరియు ఉత్తమ డీలర్ షిప్ అనుభవాన్ని కల్పిస్తుందుకు గాను ఈ తరహా ఫలితాలు సాద్యమైనట్లు వెల్లడించాడు".

అమెరికాకు చెందిన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్, దేశీయంగా ఐదు కార్లను అందుబాటులో ఉంచింది. అవి,

  • ఫిగో హ్యాచ్‌బ్యాక్
  • ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్
  • ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ
  • ఎండీవర్ ప్రీమియమ్ ఎస్‌యూవీ
  • మస్టాంగ్ లగ్జరీ కారు

మీకు నచ్చిన నగరంలో, అన్ని ఫోర్డ్ కార్ల ఎక్స్ షోరూమ్ మరియు ఆన్ రోడ్ ధరలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.... మరియు దేశీయంగా అందుబాటులో ఉండే ఫోర్డ్ కార్ల ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.....

మారుతి ఈ ఏడాది తమ నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను దేశీయంగా విడుదల చేయనుంది. దీనిని క్షుణ్ణంగా పరిశీలించాలి అనుకుంటే క్రింది ఫోటో గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford Flying High In February; Registers Massive Growth In Sales
Please Wait while comments are loading...

Latest Photos