అనఫీషియల్ బుకింగ్స్ ప్రారంభించిన 2017 హోండా సిటి

Written By:

జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా విభాగం, దేశీయంగా 2017 సిటి సెడాన్‌ను విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంటోంది. 2017 జఫిబ్రవరిలో హోండా తమ ఫేస్‌‌లిఫ్ట్ సిటి సెడాన్‌ను ప్రీమియమ్ ఫీచర్లతో విడుదల చేయనుంది. ఇప్పటికే హోండా డీలర్లను అనధికారికంగా ఈ నెక్ట్స్ జనరేషన్ సిటి కి చెందిన బుకింగ్స్ ప్రారంభించినట్లు సమాచారం.

హోండా కార్ల తయారీ సంస్థ థాయిలాండ్‌లో జనవరి 12 న తమ సిటి సెడాన్ ను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల చేసింది. ముందు నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇండియాలో కూడా దీనిని విడుదల చేయనుంది. అది కూడా ఫిబ్రవరిలోనే ఉంటుందనేది సమాచారం.

కార్దేఖో అనే వెబ్‌సైట్ తెలిపిన వివరాలు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న కొంత మంది హోండా డీలర్లు ఈ అప్ కమింగ్ 2017 ఫేస్‌లిఫ్ట్ హోండా సిటి సెడాన్ కారుకు చెందిన ముందస్తు బుకింగ్స్‌ను అనధికారికంగా ప్రారంభించినట్లు తెలిసింది.

ఈ 2017 సిటి సెడాన్ ఇంటీరియర్ తో పాటు ఎక్ట్సీరియర్ డిజైన్‌లో కూడా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రత్యేకించి ఫ్రంట్ గ్రిల్, బంపర్, పగటి పూట వెలిగే లైట్ల ఇముడింపుతో ఉన్న ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ నూతన డిజైన్‌లో ఉన్నాయి.

సరికొత్త 2017 ఫేస్‌లిఫ్ట్ సిటి సెడాన్ లో 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ రానున్నాయి. వెనుక వైపు డిజైన్‌లో రీడిజైన్ చేయబడిన బంపర్ మరియు ఎల్ఇడి ఎఫెక్ట్ గల టెయిల్ ల్యాంప్స్ రానున్నాయి.

ఇంటీరియర్ పరంగా ప్రీమియమ్ అనుభూతిని పొందడానికి లెథర్ అప్‌హోల్‌స్ట్రే, న్యూ డిజైన్‌లో ఫ్రంట్ సీట్లతో పాటు అధునాతన తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉండనున్నాయి.

భద్రత పరంగా, 2017 హోండా సిటి లోని టాప్ ఎండ్ వేరియంట్ ఆరు ఎయిర్ బ్యాగులు రానున్నాయి. అన్ని వేరియంట్లలో కూడా స్టాండర్డ్ ఫీచర్లుగా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు తప్పనిసరిగా పరిచయం అవుతున్నాయి.

2017 ఫేస్‌లిఫ్ట్ హోండా సిటి సెడాన్‌లో సాంకేతికంగా 1.5-లీటర్ సామర్థ్యం పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో రానుంది. సిటి సెడాన్ లోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 117బిహెచ్‌పి పవర్ మరియు 145ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 సిటి సెడాన్ లోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ గరిష్టంగా 99బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ట్రాన్స్‌మిషన్ పరంగా అప్ కమింగ్ సిటి సెడాన్ లోని పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది. మరియు డీజల్ వేరియంట్‌ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో రానుంది.

ఒక్కసారి హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ 2017 ఫేస్‌లిఫ్ట్ సిటి సెడాన్ కారును దేశీయంగా మార్కెట్లోకి విడుదల అయితే ప్రస్తుతం అందుబాటులో మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, స్కోడా ర్యాపిడ్ మరియు వోక్స్‌వ్యాగన్ వెంటో వంటి వాటికి గట్టి పోటీనివ్వనుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిటి సెడాన్ లోని అన్ని వేరియంట్ల ధరల కన్నా 2017 సిటి సెడాన్ ధరలు రూ. 25,000 ల వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

2017 లో మారుతి సుజుకి వారి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా...? కొద్ది రోజులు వేచి ఉండండి మారుతి త్వరలో 2017 స్విఫ్ట్ ను విడుదల చేయనుంది. ఇది ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే క్రింది గల ఫోటో గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Friday, January 27, 2017, 9:00 [IST]
English summary
2017 Honda City Likely To Launch In India In February; Bookings Commenced Unofficially
Please Wait while comments are loading...

Latest Photos