భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న కార్ కలర్

Written By:

డ్రూమ్ నిర్వహించిన సర్వేలో ఇండియాలో ఎక్కువ మంది ఎంచుకుంటున్న కార్ కలర్ తెలుపు అని తేలింది. సెగ్మెంట్ల వారీగా కూడా ఇదే కలర్‌ను అతిగా ఎంచుకుంటున్నారు. హ్యాచ్‌బ్యాక్ నుండి ఎస్‌యూవీల వరకు అదే విధంగా స్మాల్ కార్ల నుండి లగ్జరీ కార్ల వరకు ఎక్కువ మంది తెలుపుకే మొగ్గుచూపుతున్నారు.

సాధారణంగా కార్ల తయారీదారులు కస్టమర్లను ఆకట్టుకోవడానికి 9 నుండి 12 రేంజ్‌లలో కలర్‌ ఆప్షన్‌లను కల్పిస్తారు, దీనికి అదనంగా డ్యూయల్ పెయింట్ స్కీమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎన్ని రంగులు ఉన్నప్పటికీ రోడ్ల మీద ఎక్కువగా కనిపించేది తెలుపు రంగు కార్లే.

సర్వే వివరాల ప్రకారం మొత్తం విక్రయాల్లో 46 శాతం తెలుపు రంగు కార్లు ఉండగా, సిల్వర్ 20 శాతం మరియు గ్రే 11 శాతం వరకు ఉన్నట్లు తెలిసింది.

మిగతా రంగులైన ఎరుపు, ఆరేంజ్ మరియు నలుపు రంగులు అన్నీ కలిపి 5 శాతంలోనే ఉన్నాయి. బీజి కలర్ 3 శాతం, బ్లూ మరియు బ్రౌన్ రంగులకు డిమాండ్ 2 శాతం మాత్రమే ఉంది.

నిపుణుల ప్రకారం, కారును చూడగానే మన దృష్టి ముందు కారు రంగు మీద పడుతుంది, ఎంచుకునే కార్ కలర్ ఎంతో ముఖ్యమైన అంశం. కార్ కలర్ మీద రీసేల్ వ్యాల్యూ కూడా ఆధారపడి ఉంటుంది. నిజమే, తెలుపు మరియు సిల్వర్ రంగు కార్లకు మంచి రీసేల్ వ్యాల్యూ ఉంది.

జెడి పవర్ నిర్వహించిన సర్వేలో భారత దేశపు ఉత్తర రాష్ట్రాలలో ఎక్కువగా తెలుపు రంగుకే ప్రాధాన్యతనిస్తున్నారు, దక్షిణ రాష్ట్రాల విషయానికి వస్తే 34 శాతం వరకు మాత్రమే తెలుపు రంగును ఎంచుకుంటున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కలర్ ఎంపికలో అనే ప్రయోగాలే చేస్తున్నారు.

ఆటో పరిశ్రమ నిపుణుల మేరకు, ఈ మధ్య కాలంలో మహిళలు కార్లను అధికంగానే ఎంచుకుంటున్నారు. అయితే సాధారణంగా పురుషుల తరహాలో కాకుండా ప్రకాశవంతమైన విభిన్న రంగులకు మహిళలు ప్రాధాన్యతనిస్తున్నట్లు తేలింది.

English summary
Read In Telugu India’s Most Preferred Car Colour Revealed
Please Wait while comments are loading...

Latest Photos