ఇసుజు వాహనాలపై లక్షన్నర వరకు తగ్గిన ధరలు

Written By:

జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ గూడ్స్ మరియు సర్వీస్ ట్యాక్స్ ప్రతిఫలాలను వినియోగదారులకు త్వరగా అందించింది. నూతనంగా జిఎస్‌టి అమలుతో ఎస్‌యూవీ వాహనాల ధరలు 12 శాతం వరకు తగ్గనున్నాయి. దీంతో ఇసుజు అప్పుడే తమ ఉత్పత్తుల ధరలలో సవరణ చేసి తగ్గించింది.

ఎస్‌యూవీ వాహనాల మీద జిఎస్‌టి పూర్తి స్థాయిలో అమలైతే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాల ధరలు తగ్గుముఖం పడతాయి. ఈ మేరకు ఇసుజు మోటార్ వాహనాల ధరల సవరణ అనంతరం, వాటి కొత్త ధరలు ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి.

ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీ ధరల శ్రేణి జిఎస్‌టి అమలైన తరువాత రూ. 22.4 నుండి 24.4 లక్షల మధ్య ఉంది. జిస్‌టికి మునుపు ఇవే ధరలు రూ. 23.9 నుండి 25.9 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉండేవి.

ఇసుజు ఈ ఎమ్‌యు-ఎక్స్ ఎస్‌యూవీని ఈ ఏడాదిలోనే విడుదల చేసింది. ఇందులో 3.0-లీటర్ల సామర్థ్యం ఉన్న ఇన్ లైన్ నాలుగు సిలిండర్ల టుర్బో డీజల్ ఇంజన్ కలదు. 174బిహెచ్‌పి పవర్ మరియు 380ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనిని 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

ఇసుజు మోటార్స్ తమ వి-క్రాస్ పికప్ ట్రక్కు మీద కూడా ధరలను తగ్గించింది. ధరల సవరణ అనంతరం వి-క్రాస్ పికప్ ట్రక్కు ధర రూ. 12.7 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉంది.

ఇసుజు మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లో తమ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఇసుజు ఉత్పత్తులను కొనుగోలు చేసే కస్టమర్లు ఎక్స్-షోరూమ్ మరియు ఇన్సూరెన్స్ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

రాష్ట్రీయంగా వాహన తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏపి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాబట్టి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో వీటిని తక్కు ధరకే ఎంచుకోవచ్చు. దీనికి తోడు జిఎస్‌టి అమలుతో ధరలు దిగిరావడం కూడా కలిసొచ్చే అంశం.

అడ్వెంచర్ సామర్థ్యం ఉన్న ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్కులో 2.5-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టుర్బో డీజల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

నూతన పన్ను విధానం జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తరువాత దేశీయ వాహన పరిశ్రమలో ఉన్న వాహనాలపై పన్ను విధానం పూర్తిగా మారిపోయింది. 28 శాతం ట్యాక్స్‌తో పాటు ఇంజన్ సామర్థ్యం మరియు వాహనం పొడవుని బట్టి 1 నుండి 15 శాతం సెస్ కూడా ఉంటుంది.

పెట్రోల్ కార్లు నాలుగు మీటర్ల పొడవులోపు ఉండి, 1,200సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న వాటి మీద సెస్ 1 శాతంగా ఉంది. మరియు 1,500సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల మీద 3 శాతం సెస్ ఉంది.

పెద్ద పరిమాణంలో ఉన్న వాహనాలు, 1,500సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం మరియు 4 మీటర్ల కన్నా ఎక్కువ పొడవున్న వాటిమీద 28 శాతం ట్యాక్స్‌తో పాటు అదనంగా 15 శాతం సెస్ ఉంటుంది.

ఈ మధ్యనే ఫోర్డ్ ఇండియా, బిఎమ్‌డబ్ల్యూ, మరియు మరియు సంస్థలు జిఎస్‌టి ఆధారంగా ధరల సవరణ చేసి ధరలను తగ్గించాయి. జూన్ నెలాఖరులోపు మరిన్ని సంస్థలు తమ ఉత్పత్తుల మీద ధరలు తగ్గిస్తాయి. అయితే కేవలం పెద్ద వెహికల్స్‌ మీద మాత్రమే ఈ తగ్గింపు ఉంటుంది.

Read more on: #ఇసుజు #isuzu
English summary
Read In Telugu Isuzu Reduces Prices Of MU-X SUV And V-Cross Pickup Truck
Please Wait while comments are loading...

Latest Photos