స్కార్పియో ఫేస్‌లిఫ్ట్‌కు పరీక్షలు నిర్వహిస్తూ పట్టుబడిన మహీంద్రా

స్కార్పియో ఫేస్‌లిఫ్ట్ వాహనాన్ని మహీంద్రా అభివృద్ది చేస్తోంది. ఈ ఫేస్‌లిఫ్ట్‌ను కర్ణాటకలోని రోడ్ల మీద రహహ్యంగా పరీక్షిస్తున్నపుడు ఆటోమొబైల్ మీడియా కంటికి చిక్కింది. దీని గురించి మరిన్ని వివరాలు.

By N Kumar

దేశీయ దిగ్గజ ఎస్‌యూవీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తమ బెస్ట్ సెల్లింగ్ స్కార్పియో ఎస్‌యూవీని అతి త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అనేక మార్పులు చేసుకున్నట్లు రహస్యంగా పరీక్షిస్తున్న వెహికల్‌ను గమనిస్తే స్పష్టం అవుతుంది.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

మహీంద్రా అండ్ మహీంద్రా తమ స్కార్పియో ఎస్‌యూవీని 2002 లో తొలిసారి ఇండియన్ మార్కెట్లోకి మొదటి ఎస్‌యూవీగా విడుదల చేసి భారీ విజయాన్ని అందుకుంది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ విపణిలో కూడా బాగా రాణించింది.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

సందర్భానుసారంగా ఆటోమొబైల్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకున్న మార్పులను గమనించి వివిధ జనరేషన్‌లలో విడుదల చేస్తూ వచ్చింది. అయితే 2014లో తొలి ఫేస్‌లిఫ్ట్‌ స్కార్పియోను విడుదల చేసింది మహీంద్రా.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

ఇప్పుడున్న స్కార్పియోలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మరోసారి ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అందుకోసం ఫేస్‌లిఫ్ట్‍‌గా భావించే స్కార్పియోను ముందు మరియు వెనుక వైపు డిజైన్ ఫీచర్లను గుర్తించడానికి వీల్లేకుండా రహస్యంగా పరీక్షలు జరిపింది.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

న్యూ స్కార్పియో బాడీ మొత్తాన్ని వదిలేసి కేవలం ముందు మరియు వెనుక వైపున నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న పోస్టర్‌కో కప్పేసి మరీ టెస్ట్ నిర్వహించింది. అయితే ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ది చేస్తున్న ఇందులో ముందు మరియు వెనుక వైపున కొత్త డిజైన్ ఫిలాసఫీ పరిచయం చేయనున్నట్లు తెలిసింది.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మరియు ట్రెండింగ్ ఫీచర్లను జోడించి కొలత పరంగా ఎలాంటి మార్పులు చేయకుండా అదే పరిమాణం బాడీతోనే నూతన స్కార్పియోను మహీంద్రా అభివృద్ది చేస్తోంది.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

ఫేస్‌లిఫ్ట్ స్కార్పియో లోని ఇంజన్‌ పవర్‌లో కూడా స్వల్పంగా మార్పులు సంభవిస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే, 138బిహెచ్‌పి పవర్ (20బిహెచ్‌పి అధికంగా) ఉత్పత్తి చేయగల 2.2-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ను అందివ్వనుంది.

మహీంద్రా స్కార్పియో ఫేస్‌లిఫ్ట్

ఈ ఇంజన్‌కు మహీంద్రా వద్ద ఉన్న అవే 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో రానున్నాయి. స్కార్పియో ఫేస్‌లిఫ్ట్‌తో పాటు మహీంద్రా ఎక్స్‌యూవీ500లో కూడా మర్పులు సంభవించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu Mahindra Scorpio Facelift Spotted Testing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X