టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీని తీసుకొస్తున్న మహీంద్రా

Written By:

దేశీయ వాహన తయరీ సంస్థ మహీంద్రా ఇండియన్ మార్కెట్లో సరికొత్త ప్రీమియమ్ ఎస్‌యువిని విడుదల చేయనుంది. ప్రస్తుతం ప్రీమియమ్ ఎస్‌యువి సెగ్మెంట్లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ లకు ఇది గట్టి పోటీని సృష్టించనుంది.

ఆటో కార్ ఇండియా తెలిపిన కథనం మేరకు మహీంద్రా అండ్ మహీంద్రా ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తున్న శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ యొక్క తరువాత తరం వాహనాన్ని కొత్త బ్యాడ్జింగ్ పేరుతో విడుదల చేయనుంది.

శాంగ్‌యాంగ్ తమ రెక్ట్సాన్ యొక్క భవిష్యత్ తరం మోడల్‌ను ఎల్ఐవి-2 కాన్సెప్ట్ ఎస్‌యువిగా 2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద ప్రదర్శించింది.

ప్రస్తుతం కొరియాకు చెందిన శాంగ్‌యాంగ్‌ మహీంద్రాతో ఉన్న అనుభందానికి పులిస్టాప్ పెట్టాలని మహీంద్రా నిర్ణయించుకుంది. దీనికి ప్రధాన కారణం అమ్మకాల్లో వృద్ది లేకపోవడం అని తెలిసింది.

ప్రస్తుతం శాంగ్‌యాంగ్ ఇండియన్ మార్కెట్లో కేవలం రెక్ట్సాన్ మోడల్‌ను మాత్రమే అందుబాటులో ఉంచింది. గడిచిన జనవరి నుండి డిసెంబర్ 2016 మధ్య దేశవ్యాప్తంగా కేవలం 146 యూనిట్ల రెక్ట్సాన్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి.

ఫార్చ్యూనర్‌కు పోటీగా రానున్న రెక్ట్సాన్ అప్ కమింగ్ ఎస్‌యువి ఎల్ఐవి-2 కొలతల పరంగా పొడవు 1.96 మీటర్లు, వెడల్పు 1.8 మీటర్లుగా ఉంది. ఈ ఎస్‌యువిలో ఏడు మంది కూర్చునే సీటింగ్ సామర్థ్యం ఖచ్చితంగా ఉండేలా మహీంద్రా దృష్టిసారిస్తోంది.

దేశీయంగా విడుదల కానున్న ఈ మహీంద్రా ఎస్‌యువిలో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లను అందివ్వనుంది. ఇది పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభించును మరియు వీటికి మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల అనుసంధానం కలదు.

సాంకేతికంగా ఇది 222బిహెచ్‌పి పవర్ మరియు 349ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 2.0-లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లతో లభించును.

మరియు ఈ ఎస్‌యువిలో 181బిహెచ్‌పి పవర్ మరియు 420ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 2.2-లీటర్ టుర్బోచార్జ్‌‌డ్ డీజల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో లభించును.

మహీంద్రా ఎల్ఐవి-2 వాహనంలో 2,865ఎమ్ఎమ్ పొడవైన వీల్ బేస్ కలదు, ఇది ఫార్చ్యూనర్ కన్నా 120ఎమ్ఎమ్ ఎక్కువగా ఉంటుంది. ఫార్చ్యూనర్ కు మరింత పోటీనిస్తూ మహీంద్రాకు బలాన్ని చేకూర్చే విధంగా దీని ఇంటీరియర్‌ను అత్యాధునిక సొబగులతో తీర్చిదిద్దడం జరిగింది.

మహీంద్రా నూతన ఎస్‌యువి 9.2-అంగుళాల పరిమాణం గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రానుంది.

మహీంద్రా ఈ ఎస్‌యువిని 2017 డిసెంబర్ నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఎక్స్‌యువి700 అనే బ్యాడ్జి పేరుతో వచ్చే అవకాశం ఉంది. ధర పరంగా ఫార్చ్యూనర్ కన్నా నాలుగు నుండి ఐదు లక్షల తక్కువ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

చైనాకు రష్యా అత్యాధునిక ఫైటర్ జెట్ సుఖోయ్ 35: భారత్ పరిస్థితి ఏంటి ?
గత ఏడాది చైనా ఏవియేషన్ ప్రదర్శన వేదిక మీద తమ శక్తివంతమైన జె 20 పైటర్ జెట్ ను ప్రదర్శించింది. అయితే రష్యా అత్యంత శక్తివంతమైన తమ ఐదవ తరానికి చెందిన ఎస్‌యు-35 ఫైటర్ జెట్‌లను చైనాకు డెలివరీ ఇచ్చింది.

 

2017 సరికొత్త టయోటా ఫార్చ్యూనర్ ప్రీమియమ్ ఎస్‌యువి ఫోటో గ్యాలరీ...
 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Mahindra To Launch Toyota Fortuner Rival
Please Wait while comments are loading...

Latest Photos