మహీంద్రా టియువి500: ఫోటోలు మరియు సాంకేతిక వివరాలు

మహీంద్రా అండ్ మహీంద్రా రహస్యంగా ఓ ఎమ్‌పివి వాహనాన్ని అభివృద్ది చేస్తోంది. టియువి500 అనే పేరుతో తయారవుతున్న దీనిని ఇప్పటికే పలుమార్లు రహస్యంగా పరీక్షించింది. ఇప్పుడు మరో మారు మళ్లీ పరీక్షలకొచ్చింది.

Written By:

పొడవాటి వీల్ బేస్ కలగి ఉన్న వాహనాన్ని ఎమ్‌పివి శ్రేణిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టియువి500 అనే పేరుతో అభివృద్ది మహీంద్రా చేస్తున్న ఎమ్‌పివి వాహనాన్ని తాజాగా రహస్యంగా పరీక్షిస్తోంది. అయితే ఈ సారి సాంకేతిక వివరాలు కూడా విడుదలయ్యాయి.

డిజైన్ పరంగా ఈ టియువి500 వాహనం ట్యాంకు తరహాలో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టియువి300 కు అతి దగ్గర పోలికలతో ఉన్న దీనిని ఎమ్‌పివి శ్రేణిలో టియువి500 పేరుతో ప్రవేశపెట్టనుంది.

ముందు వైపున పొడవాటి ప్లేట్ల తరహాలో ఉన్న ఫ్రంట్ గ్రిల్, క్రింది వైపున బంపర్ మధ్యలో ఉన్న ఎయిర్ ఇంటేకర్‌కు ఇరువైపులా చతుర్బుజాకారంలో ఉన్న ఫాల్యాంప్స్ మరియు పై భాగంలో ఫ్రంట్ బ్యానెట్‌కు కాస్త క్రింద ఇరువైపులా చతుర్బుజాకారంలో ఉన్న హెడ్ ల్యాంప్స్ కలవు.

మహీంద్రా దీనిని పరీక్షించే సమయంలో పెద్ద రహస్యాన్నే రివీల్ చేసింది. ఎన్నడూ లేని విధంగా ఇందులో అందించే ఇంజన్ వివరాలు పరోక్షంగా వివరించింది. ప్రస్తుతం పరీక్షలకొచ్చిన వేరియంట్లో 1.99-లీటర్ సామర్థ్యం ఉన్న ఎమ్‌హాక్ డీజల్ ఇంజన్ కలదు.

ప్రస్తుతం దేశీయంగా ఉన్న అన్ని వాహన తయారీ సంస్థలు తమ వాహనాలలో బిఎస్-IV ఉద్గార నియమాలు పాటించే ఇంజన్‌ను తప్పనిసరిగా అందించాల్సి ఉంది. దీనికి అనుగుణంగా బిఎస్-IV ఇంజన్‌ను మహీంద్రా ఈ ఎమ్‌పివిలో అందించింది.

ప్రస్తుతం కేవలం ఢిల్లీలో మాత్రమే విక్రయించబడుతున్న స్కార్పియో మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 వాహనాలలోని బ్యానెట్‌ల క్రింద కూడా ఇదే ఇంజన్ కలదు.

అయితే ఎక్స్‌యూవీ500 లో 140బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.99 లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్ కాకుండా 120బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే స్కార్పియో లోని ఇంజన్‌ ఇందులో రానున్నట్లు సమాచారం.

మారుతి ఎర్టిగా ఎమ్‌పివి అమ్మకాలను పూర్తిగా మహీంద్రా టియువి500 తినేయనుంది, ఇది ముందు వైపుకు ఫేసింగ్ ఉండే 7-సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉండటం, సేఫ్టీ, సౌకర్యం మరియు ఫీచర్ల పరంగా పోటీదారులను బలంగా ఎదుర్కోనుంది.

ఇంటీరియర్ స్పేస్‌కు పెట్టింది పేరు మహీంద్రా ఎక్స్‌యూవీ500, మహీంద్రాకు తృప్తికరమైన విక్రయాలు సాధించిపెడుతున్నఎక్స్‌యూవీ500 ఎస్‌యువి ఫోటో గ్యాలరీ కోసం....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Monday, January 23, 2017, 18:03 [IST]
English summary
Spy Pics: Mahindra TUV 500 (TUV Long Wheelbase) Spotted Testing; Engine Revealed
Please Wait while comments are loading...

Latest Photos