ఎక్లిప్స్ క్రాస్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన మిత్సుబిషి

Written By:

జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ మిత్సుబిషి సరికొత్త ఎస్‌యూవీని ఆవిష్కరించింది. 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద మొదటి సారిగా ఈ ఎక్లిప్స్ క్రాస్ ఎస్‌యూవీని ప్రదర్శించనుంది. డిజైన్, ఇంజన్ మరియు ఇతర వివరాల గురించి తెలుసుకుందాం రండి...

మిత్సుబిషి ఈ సరికొత్త ఎక్లిప్స్ క్రాస్ ఎస్‌యూవీలో రెండు టర్బోఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల ఇంజన్‌లతో అందివ్వనుంది. అవి 1.5-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్‌ డీజల్ గా ఉన్నాయి.

పెట్రోల్ వేరియంట్లో సివిటి గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది. మరియు డీజల్ వేరియంట్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

ఎక్లిప్స్ క్రాస్ ఎస్‌యూవీ అత్యంత పదునైన అగ్రెసివ్ ఫ్రంట్ డిజైన్ కలిగి ఉంది. ఇందులో ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ అందించిన తీరును గమనిస్తే కొద్దిగా మిత్సుబిషి అవుట్ ల్యాండర్‌ను పోలి ఉంటుంది.

విశాలమైన ఎయిర్ ఇంటేకర్‌కు పై భాగంలో రెండు క్రోమ్ పట్టీలు, అదే విధంగా పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్ల ఇముడింపుతో చిన్న పరిమాణంలో ఉన్న యాంగులర్ హెడ్ లైట్లు కలవు.

వెనుక వైపు డిజైన్ టాలా విచిత్రంగా ఉంటుంది. బాడీ కలర్లో ఉన్న చిన్న స్ట్రిప్ ద్వారా వాలుగా ఉన్న రియర్ మిర్రర్‌ను రెండుగా విభజించింది. మరియు రియర్ మిర్రర్‌కు ఇరువైపులా ఆంగ్లపు సి-ఆకారంలో ఉన్న టెయిల్ లైట్లు ఉన్నాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే, ఎక్లిప్స్ క్రాస్‌ ఎస్‌యూవీలో హెడ్స్ అప్ డిస్ల్పే, టచ్ కంట్రోలర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

జపాన్ దిగ్గజం ఎక్లిప్స్ క్రాస్ ఎస్‌యూవీని 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద ప్రదర్శించిన అనంతరం, ముందుగా యూరోపియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇండియన్ విడుదలపై మిత్సుబిషి ఎలాంటి ప్రకటన చేయలేదు.

మిత్సుబిషి ఎక్లిప్స్ క్రాస్ ఎస్‌యూవీని కొనే ఆలోచనలో ఉన్నారా... అయితే అంతర్జాతీయ మార్కెట్ నుండి దిగుమతి చేసుకోవాలి. దీనికి చెందిన మరిన్ని ఫోటోలను వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి...

 

 

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Mitsubishi Eclipse Cross SUV Revealed — Will It Block Out Its Rivals?
Please Wait while comments are loading...

Latest Photos