మరో కొత్త వేరియంట్లో ఇండియా మెచ్చిన పికప్ ట్రక్కు

Written By:

తీవ్రమైన పోటీని ఎదుర్కోవడానికి టాటా మోటార్స్ తమ ఏస్ మిని ట్రక్కును కొద్దిగా పొడవుగా మరియు ధృడంగా నిర్మిస్తోంది. ఏస్ మిని ట్రక్కుకు పోటీగా ఉన్న ఇతర వాహనాలు ఏస్ అమ్మకాలను కొద్దికొద్దిగా తినేస్తున్నాయి. అయితే లైట్ కమర్షియల్ వెహికల్‌ సెగ్మెంట్లో శక్తివంతమైన బ్రాండ్‌గా ఎదగడానికి ఏస్ మిని ట్రక్కును ఇప్పుడు మరో నూతన వేరియంట్లో విడుదలకు సిద్దమవుతోంది.

స్మాల్ కమర్షియల్ స్పేస్ 1.0 నుండి 1.25 టన్నుల సామర్థ్యం ఉన్న మిని ట్రక్కులు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో టాటా ఏస్ మార్కెట్ లీడర్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం లైట్ వెయిట్ కమర్షియల్ మార్కెట్లో టాటా ఏస్ వాటా 62 శాతంగా ఉంది. అయితే గడిచిన మూడేళ్ల కాలంలో 10 శాతం వాటాను కోల్పోయింది.

ఇందుకు ప్రధాన కారణం మహీంద్రా అండ్ మహీంద్రా వారి మ్యాక్సిమో, జీతో, సుప్రో మరియు అశోక్ లేలాండ్ యొక్క దోస్త్ వాహనాలు టాటా ఏస్ కు గట్టి పోటీగా నిలిచాయి.

పోటీదారులను ఎదుర్కొనేందుకు టాటా తమ ఏస్ మిని ట్రక్కును ఇప్పుడు నూతన ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేస్తోంది. తద్వారా ఇది ఎక్కువ పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటూ ప్రస్తుతం ఉన్న మోడల్‌తో పోల్చుకుంటే మరింత ధృడంగా రూపాంతరం చెందనుంది.

ఏస్ ట్రక్కుల్లో అత్యుత్తమ పేలోడ్ సామర్థ్యాన్ని కల్పిస్తూ ధృడమైన చాసిస్ అందివ్వడం ద్వారా, చిన్న రవాణా సెగ్మెంట్లో అత్యుత్తమ కెపాసిటి, గొప్ప భద్రత, సౌకర్యం, నాణ్యత మరియు ధరకు తగ్గ విలువలను కలిగి ఉండనుంది.

అశోక్ లేలాండ్ దోస్త్ ఇప్పుడు అమ్మకాల్లో నేల చూపులు చూస్తోంది. మార్కెట్లో కొద్ది కొద్దిగా పట్టును కోల్పోతోంది. నిస్సాన్ మోటార్స్ నుండి భాగస్వామ్యపు ఒప్పందాన్ని విరమించుకున్న తరువాత మరో చిన్న కమర్షియల్ వెహికల్ నిర్మాణానికి అశోక్ లేలాండ్ ప్రయత్నిస్తోంది. దీనిని 2018 లో విపణిలోకి విడుదల చేసే అవకాశం ఉంది.

సరికొత్త టాటా ఏస్ ఎక్స్ఎల్ వెర్షన్ సాధారణ ఏస్ కన్నా 15 శాతం ఎక్కువ బరువును మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బిఎస్-iV ఉద్గార నియమాలను పాటించే ఇంజన, సరికొత్త ఇంటీరియర్ డిజైన్, పవర్ స్టీరింగ్ లను అన్నింటిలో కూడా స్టాండర్డ్‌గా అందివ్వనుంది.

ప్రస్తుతం విపణిలో ఉన్న పికప్ ట్రక్కు మరియు మిని ట్రక్కుకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి ఎక్స్ఎల్ వెర్షన్ ఏస్ ఈ రెండింటిలో మధ్యలో విడుదల కానుంది. మహీంద్రా సెగ్మెంట్లోని పికప్ ట్రక్కుకు కౌంటర్ ఇస్తూ టాటా ఈ మధ్యనే జెనాన్ యోధా పికప్ ట్రక్కును విడుదల చేసింది.

టాటా కమర్షియల్ వెహికల్ లైనప్‌లో జెనాన్ యోధా పికప్ ట్రక్కుకు క్రింది స్థానాన్ని ఇది భర్తీ చేయనుంది. టాటా మోటార్స్ ఈ మధ్యనే ఇండియన్ మార్కెట్లోకి హెక్సా ఎమ్‌పీవీ ని విడుదల చేసింది. ఫోటోల కోసం క్రింది గ్యాలరీని వీక్షించగలరు....

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Tata Motors To Launch 'New Ace XL' Mini-Truck
Please Wait while comments are loading...

Latest Photos