టాటా హెక్సా ధరలు లీక్

టాటా మోటార్స్ వచ్చే జనవరి 18, 2017 నాటికి ఇండియన్ మార్కెట్లోకి తమ హెక్సా ను విడుదల చేయనుంది. అయితే టాటా అధికారిక వెబ్‌సైట్ నుండి ఈ హెక్సా ధరలు లీక్ అయ్యాయి.

Written By:

టాటా మోటార్స్ నుండి విడుదలకు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎమ్‌పివిహెక్సా. దీనిని జనవరి 18, 2017 నాటికి విపణలోకి విడుదల చేస్తున్నట్లు ఇది వరకే టాటా ప్రకటించింది. అయితే మరి టాటా హెక్సా ధరలు ఎలా ఉండనున్నాయి అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారిపోయింది. ఈ తరుణంలో టాటా అధికారిక వెబ్‌సైట్ నుండి హెక్సా ధరలు లీక్ అయ్యాయి.

టాటా అధికారిక వెబ్‌సైట్లో టెస్ట్ డ్రైవ్ ఆప్షన్‌లో హెక్సా ప్రారంభ ధర రూ. 12.30 లక్షలు అని ప్రచురించబడింది. అయితే వెంటనే గమనించిన టాటా అధికారులు దీని స్థానంలో వేరే టెక్ట్స్ ప్రచురించారు.

ఇది మానవ తప్పిదమా లేక పోతే సాంకేతిక లోపమా అనేది అటుంచితే టాటా హెక్సా ప్రారంభ ధర రూ. 12.30 లక్షలుగా ఉంటుందనేది దాదాపుగా ఖాయమైందని చెప్పుకోవాలి.

టాటా హెక్సా మొత్తం తొమ్మిది ట్రిమ్ లలో ఆరు వేరియంట్లుగా లభ్యం కానుంది. ఈ ఎమ్‌పివి వాహనాన్ని వినియోగదారులు 6 మరియు 7 సీటింగ్ సామర్థ్యంతో ఎంచుకోవచ్చు. ఇక మార్కెట్లోకి విడుదలయితే టాటా సంస్థకు ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలవనుంది.

సాంకేతికంగా హెక్సా ఎమ్‌పివి 2.2-లీటర్ సామర్థ్యం గల వారికోర్ డీజల్ ఇంజన్‌తో రానుంది. ఇది రెండు రకాలుగా పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేయును.

హెక్సాలోని వారికోర్ 300 వేరియంట్ గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. ఇది 5-స్పీడ్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లతో పరిచయం కానుంది.

హెక్సా లోని మరో డీజల్ ఇంజన్ వేరియంట్ వారికోర్ 400 గరిష్టంగా 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. అయితే ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది.

టాటా హెక్సా ఎమ్‌పివి మార్కెట్లోకి విడుదలయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ500, టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు రెనో లాజీ వంటి వాటితో పోటీపడనుంది.

టాటా హెక్సా ఎమ్‌పివి ఫోటోలు మీ కోసం....
 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, January 10, 2017, 17:15 [IST]
English summary
Tata Hexa Price Leaked; Base Variant Might Start From Rs 12.30 Lakh
Please Wait while comments are loading...

Latest Photos

LIKE US ON FACEBOOK