స్పై పిక్స్: కొత్త ఇంటీరియర్ ఫీచర్లతో పరీక్షలకొచ్చిన నెక్సాన్

Written By:

టాటా మోటార్స్ తమ సబ్ కాంపాక్ట్ ఎస్‌యువి నెక్సాన్ ను మళ్లీ పరీక్షించింది. విడుదల అతి త్వరలోనే ఉందనే విషయాన్ని తెలియజేసే విధంగా దీనికి కొత్త ఫీచర్లను జోడించి అనేక మార్లు పరీక్షించింది. ప్రస్తుతం మారుతి సుజుకి వితారా బ్రిజాకు గట్టి పోటీనివ్వగలిగేలా నెక్సాన్ ఇంటీరియర్‌లో మరో ఫీచర్ ను గుర్తించడం జరిగింది.

ఎక్ట్సీరియర్ డిజైన్ అంశాలను ఏ విధంగా గుర్తించడానికి వీలు లేకుండా డేగ కన్నుతో కనిపెట్టుకుని అతి జాగ్రత్తగా రహస్యంగా, బాడీ మీద నలుపు మరియు తెలుపు కాగితాలతో రహదారి మీదకు తీసుకొచ్చి పరీక్షలు చేస్తోంది.

అయితే ఇంటీరియర్ లోని ఫీచర్లను గుర్తించడాన్ని ఆపడం వీరి వల్ల కాలేకపోయింది. ఇంటీరియర్ లో తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్ కలదు.

సాంకేతికంగా ఇది టియాగోలోని 1.2-లీటర్ రివట్రాన్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ నూతన డీజల్ ఇంజన్‌తో రానుంది.

టాటా ఈ ఏడాదిలో జనవరి 18 న విడుదలయ్యే అవకాశం ఉంది. దీని తరువాత విడుదల కానున్న కైట్ 5 సబ్ 4 మీటర్ సెడాన్ విడుదల అనంతరం నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రారంభమైన 2017 నిస్సాన్ మైక్రా ప్రొడక్షన్
నిస్సాన్ ఫ్రాన్స్ లోని నిస్సాన్-రెనో భాగస్వామ్యపు ప్రొడక్షన్ ప్లాంటులో 2017 మైక్రా హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని ప్రారభించింది.

2017 లో విడుదల కానున్న నాలుగు సబ్ కాంపాక్ట్ SUVలు
నాలుగు మీటర్ల లోపు పొడవున్న నాలుగు కాంపాక్ట్ ఎస్‌యువిలు 2017 ఏడాదిలో మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి.

 

English summary
Spy Pics: Tata Nexon Spotted Testing; Interiors Reveal New Feature
Please Wait while comments are loading...

Latest Photos