సి-క్యూబ్ కాన్సెప్ట్ ఆవిష్కరించిన టాటా టామో

Written By:

ముంబాయ్ నగర వేదికగా మైక్రోసాఫ్ట్ ఇండియా నిర్వహిస్తున్న ఫ్యూచర్ డికేడ్ 2017 వేదిక మీద టాటా మోటార్స్ యొక్క టామో విభాగం సి-క్యూబ్ అనే కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. కార్లలో అడ్వాన్స్‌డ్ కనెక్టెడ్ ఫీచర్లు మరియు వినియోగదారుల కోసం డిజిటల్ ఎకోసిస్టమ్స్ ఫీచర్లను అభివృద్ది చేయడానికి టాటా మోటార్స్ మరియు మైక్రోసాఫ్ట్ ఇండియా జట్టు కట్టాయి.

టాటా మోటార్స్ దీని ప్రదర్శన వేదిక మీద టామో సి-క్యూబ్ కాన్సెప్ట్ కు సంభందించిన ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. దీని ఆకృతి మరియు డిజైన్ పరంగా చూస్తే, ఈ మూడు డోర్ల హ్యాచ్‌బ్యాక్‌ను టియాగో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించారని తెలిసినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

డిజైన్ పరంగా సి-క్యూబ్ క్రీడా శైలిలో ఉన్న ఆకృతిని కలిగి ఉంది. పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల ఇముడింపుతో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్‌ను కలిగి ఉంది. రెండు హెడ్ లైట్లను వేరు చేస్తూ మధ్యలో టాటా చిహ్నం గల ఫ్రంట్ గ్రిల్ కలదు(ప్రస్తుతం టాటా లైనప్‌లో మరే మోడల్‌లో ఈ తరహా ఫ్రంట్ గ్రిల్‌ను గుర్తించలేము).

సి-క్యూబ్ కాన్సెప్ట్ స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్‌లో పొగచూరిన రంగులో ఉన్న ఒ.జడ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వీటికి తక్కువ ప్రొఫైల్ ఉన్న టైర్లను జోడించడం జరిగింది.

టాటా మోటార్స్ తమ టామో విభాగం ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన ఈ సి-క్యూబ్ కాన్సెప్ట్‌ను 2017 జెనీవా మోటార్ షో వాహన ప్రదర్శన వేదిక మీద అంతర్జాతీయ ప్రదర్శనకు తీసురానుంది. మరిన్ని తాజా ఆటోమొబైల్ కథనాలను తెలుగులో చదవడానికి చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్.

టాటా బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ టియాగో ను కొనే ఆలోచనలో ఉన్నారా...? అయితే అన్ని కోణాలలో తీసునటువంటి టియాగో ఫోటోలను గమనించి తుది నిర్ణయం తీసుకోండి.టియాగో ఫోటోలు వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద చేయండి...

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Tata TAMO C-Cube Concept Unveiled At Future Decoded 2017
Please Wait while comments are loading...

Latest Photos