టాటా మోటార్స్ నుండి మరో మోడల్: టియాగో ఆక్టివ్

టాటా మోటార్స్ ముంబాయ్‌లో జరుగుతున్న ఓ ప్రదర్శన వేదిక మీద టియాగో యొక్క క్రాసోవర్ వేరియంట్ టియాగో ఆక్టివ్‌ను ఆవిష్కరించింది. దీనిని అతి త్వరలో విడుదల చేస్తున్నట్లు సమాచారం.

Written By:

2016 లో టాటా మోటార్స్ విడుదల చేసిన టియాగో ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హ్యాచ్‌బ్యాక్ విజయంతో దేశీయంగా ఉన్న దిగ్గజ సంస్థలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. టాటా తమ టియాగో విజయాన్ని కొనసాగించడానికి మరో ఆసక్తికరమైన మోడల్‌ను అభివృద్ది చేసింది. దాని గురించి పూర్తి వివరాలు....

గతంలో 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద టాటా మోటార్స్ జికా ఆక్టివ్ హ్యాచ్‌బ్యాక్ వేరియంట్ ను ప్రదర్శించింది. అయితే ఇప్పుడు ముంబాయ్‌లో జరిగిన ఓ ప్రదర్శన కార్యక్రమంలో టియాగో ఆక్టివ్‌ను ఆవిష్కరించింది.

ఈ టియాగో ఆక్టివ్ వేరియంట్ టియాగో హ్యాచ్‌బ్యాక్ యొక్క క్రాసోవర్ మోడల్ అని సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి దీనిని విడుదల చేయనుంది.

టియాగోలోని రెగ్యులర్ వెర్షన్‌లో ఉన్నటువంటి ఇంజన్‌ ఆప్షన్‌లతో టియాగో ఆక్టివ్ రానుంది, కాబట్టి మెకానికల్‌గా ఎలాంటి మార్పులకు గురవ్వడంలేదనే విషయం స్పష్టం అవుతోంది.

డిజైన్ పరంగా ప్రస్తుతం ఉన్న మోడల్‌కు కాస్త అడ్వాన్స్‌డ్‌గా బ్లాక్ క్లాడింగ్ మీద సిల్వర్ బంపర్ అందివ్వడం జరిగింది. ఇదే కలర్ తరహాలోని బ్లాక్ బంపర్ రియర్ సైడ్ కూడా కలదు.

ఈ టియాగో యాక్టివ్ వేరియంట్లోని ఎక్ట్సీరియర్ మీద సిల్వర్ బాష్ ప్లేట్లు, బాడీకి ఇరుప్రక్కవైపుల క్లాడింగ్, నల్లటి షేడ్ గల రూఫ్ టాప్, సిల్వర్ పూతతో ఉన్న రూఫ్ రెయిల్స్ మరియు అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లతో పాటు గన్ మెటల్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఇంటీరియర్‌లో బాడీ కలర్ గల కొన్ని ప్యానల్స్ మరియు లెథర్ సీట్లు ఉన్నాయి, ఈ రెండు మినహాయిస్తే మరే ఇతర నూతన ఫీచర్లు లేవు. మునుపటి టియాగోలోని అన్ని ఫీచర్ల జోడింపు జరగనుంది.

ఏడాది క్రితం 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన ఆక్టివ్ వేరియంట్‌తో ఈ నూతన టియాగో ఆక్టివ్‌ను పోల్చిచే అందులో ఉన్నటువంటి కొన్ని బాడీ డీకాల్స్ మరియు మెషినింగ్ చేసిన అల్లాయ్ వీల్స్ ఇందులో మిస్సయ్యాయి.

టాటా మోటార్స్ ఈ టియాగో ఆక్టివ్ క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ ను పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో విడుదల చేయనుంది. ట్రాన్స్‌మిషన్ పరంగా ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

టాటా టియాగో విడుదలైనప్పటి నుండి 50,000 యూనిట్లకు పైగా విక్రయించబడ్డాయి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ కార్ల జాబితాలో పాటు టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో కూడా చోటు సంపాదించింది.
Via AutosArena 

ఇప్పుడు టియాగో అమ్మకాలను పెంచుకునేందుకు అదును చూసి విపణిలోకి ఈ యాక్టివ్ మోడల్‌ను విడుదల చేయనుంది. మరిన్ని తాజా ఆటోమొబైల్ వార్తలు మరియు సమాచారం కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు...

తెలుగు ఆటోమొబైల్ ప్రియుల కోసం డ్రైవ్‌పార్క్ తెలుగు న్యూస్, రివ్యూస్ మరియు చిట్కాలతో పాటు కార్లు మరియు బైకులకు చెందిన ఫోటో గ్యాలరీని పరిచయం చేస్తోంది.
టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ ఫోటోలు మీ కోసం....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Saturday, January 21, 2017, 12:35 [IST]
English summary
Tata Motors Showcases The Tiago Aktiv; India Launch Soon
Please Wait while comments are loading...

Latest Photos