టాటా టియాగో ఆటోమేటిక్ వేరియంట్ల వివరాలు వెల్లడి

టాటా మోటార్స్‌కు తమ చరిత్రలోనే ఘణమైన విజయం సాధించి పెట్టిన టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను ఇప్పుడు ఆటోమేటిక్ వేరియంట్లో విడుదల చేయడానికి సిద్దంమైంది, టియాగో ఏఎమ్‌టి గురించి రహస్యంగా వెల్లడైన వివరాలు ఇవాళ్టి స

Written By:

టాటా మోటార్స్ తమ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్‌ టియాగో లో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్(AMT) గల గేర్‌బాక్స్‌ను అందించి అతి త్వరలో దేశీయ విపణిలోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని విడుదలకు ముందుగానే కొన్ని రహస్య వివరాలు ఆన్‌లైన్ వార్తా వేదికలో లీకయ్యాయి. వీటి ఆధారంగా టియాగో ఆటోమేటిక్ గురించి పూర్తి వివరాలు క్షుణ్ణంగా...

టీఎమ్‌బిహెచ్‌పి అనే ఆన్‌లైన్ వార్తా వేదిక ప్రచురించిన కథనం మేరకు టాటా మోటార్స్ యొక్క ప్యాసింజర్ కార్ల డయాగ్నోస్టిక్స్ సాఫ్ట్‌వేర్ (టిడిఎస్) ఆవిష్కరించిన వివరాల ప్రకారం టియాగో ఆటోమేటిక్ ఎక్స్‌టి మరియు ఎక్స్‌జడ్ వేరియంట్లలో మాత్రమే లభించును.

రహస్యంగా లీకయిన ఫోటోను గమనిస్తే, రెండు వేరియంట్లలో కూడా 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న రివట్రాన్ పెట్రోల్ ఇంజన్‌కు మాత్రమే పరిమితం అనే విషయం స్పష్టమవుతుంది. భవిష్యత్తులో దీనికి కొనసాగింపుగా డీజల్ హ్యాచ్‌బ్యాక్‌లో ఈ ఏఎమ్‌టి పరిచయం చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం అందిన తాజా సమాచారం మేరకు మ్యాగ్నెట్టి మారెల్లీ సంస్థ యొక్క 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది.

టాటా టియాగో సంస్థ యొక్క న్యూ జనరేషన్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించిన మోడల్. ఇది టాటా ఫ్యామిలీలోకి కొత్త వచ్చి చేరిన మూడు సిలిండర్ల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించును.

టియాగో ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్లోని 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న రివట్రాన్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో ఉన్న ఇదే వేరియంట్ లీటర్‌కు 23.84కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలిగేది. అయితే ఆటోమేటిక్ వేరియంట్ టియాగో యొక్క మైలేజ్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

టాటా మోటార్స్ ఈ ఏఎమ్‌టి టియాగోను పూర్తి స్థాయి అమ్మకాలకు మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం అందుహబాటులో ఉన్న మారుతి సెలెరియో ఆటోమేటిక్ మరియు ఆల్టో కె10 ఆటోమేటిక్ లతో పాటు మరిన్ని ఎంట్రీ లెవల్ ఆటోమేటిక్ కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

ధర విషయానికి వస్తే, ప్రస్తుతం ఉన్న టియాగో మ్యాన్యువల్ వేరియంట్ల కన్నా ఆటోమేటిక్ వేరియంట్ల ధరలు రూ. 30,000 నుండి 50,000 ల వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద వీటి ధరలు రూయ 3.4 నుండి 6 లక్షల వరకు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా అందుబాటులో ఉండనున్నాయి.

టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన అద్బుతమైన ఎస్‌యూవీ హెక్సా ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి...

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Tata Tiago AMT Variant Details Leaked Ahead Of Launch
Please Wait while comments are loading...

Latest Photos