టాటా అప్ కమింగ్ కాంపాక్ట్ సెడాన్ టిగార్ గురించి అతి ముఖ్యమైన విషయాలు

విశిష్టమైన డిజైన్‌తో అత్యంత సరసమైన కాంపాక్ట్ సెడాన్‌గా టాటా మోటార్స్ తమ టిగార్ ను విడుదల చేయనుంది. దీని గురించి అతి ముఖ్యమైన ఐదు విశయాల గురించి నేటి కథనంలో తెలుసుకుందాం రండి.

By Anil

టియాగో హ్యాచ్‌బ్యాక్ విజయానంతరం టాటా మోటార్స్ అమితాసక్తితో అభివృద్ది చేసిన కాంపాక్ట్ సెడాన్ టిగార్. వినియోగదారులకు అనేక లాభాలను చేకూర్చే విధంగా టాటా తమ టిగార్‌ను ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డిజైన్ చేసింది.

టాటా టిగార్ కాంపాక్ట్ సెడాన్

టాటా టియాగో తరువాత హెక్సా ఎమ్‌పీవీని కూడా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా అభివృద్ది చేసింది. మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుండి మంచి ఫలితాలనే సాధిస్తోంది. ఇక మరో విజయాన్ని ఖాయం చేస్తూ అతి త్వరలో టిగార్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

టాటా ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ నుండి వస్తోన్న మూడవ అతి ముఖ్యమైన మోడల్‌ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఐదు అతి ముఖ్యమైన విషయాలు

పేరు

పేరు

టాటా మోటార్స్ తొలుత దీనిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద కైట్5 అనే పేరుతో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. అయితే తరువాత ఆల్టిగో లేదా వియాగో అనే పేర్లను తెర పైకి తెచ్చింది. చాలా మంది పాఠకులు వియాగో (సంస్కృతంలో వియాగో అంటే వియోగం అనే పదానికి సమానం, వియోగం అంటే కోల్పోవడం. కాబట్టి ఇది శుభసూచకం కాదు) అనే పేరును వ్యతిరేకించారు. తరువాత టాటా మోటార్స్ ఈ కాంపాక్ట్ సెడాన్‌కు టిగార్ (Tee-gor) అనే పేరును ఖరారు చేసింది.

డిజైన్

డిజైన్

ప్రస్తుతం విపణిలో బాడీ ఆకృతిని బట్టి హ్యాచ్‌బ్యాక్స్, నాచ్‌బ్యాక్స్, సెడాన్స్, కూపే వివిధ పేర్లతో పిలుస్తుంటాం. అయితే టాటా మోటార్స్ దీనిని స్టైల్‌బ్యాక్‌గా అభివర్ణించింది. నిజానికి స్టైల్‌బ్యాక్ అనే పదానికి టాటా యొక్క ఆవిష్కృతం. కాని దీనిని నాచ్‌బ్యాక్ బాడీ స్టైల్ క్రిందకు చేర్చడం జరిగింది. మొత్తం బాడీ డిజన్‌తో పాటు రియర్ విండో వద్ద దీని విలక్షణమైన డిజైన్ ఆవిష్కరణం చాలా మందిని కట్టిపడేస్తుంది.

ధర

ధర

నూతన ఉత్పత్తుల అభివృద్దిలో మాత్రమే కాదు, వాటికి తెలివిగా ధరలు నిర్ణయించడంలో కూడా టాటా మోటార్స్ రారాజు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ధరలను నిర్ణయించడం ద్వారా టియాగో మరియు హెక్సా లు మంచి విజయాన్ని అందుకున్నాయి. టాటా జెస్ట్ కు దిగువ స్థానంలో అత్యంత సరసమైన సెడాన్ కారుగా అందుబాటులోకి తీసుకురానున్న దీని ప్రారంభ ధర సుమారుగా రూ. 4 నుండి 4.5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

ఫీచర్లు

ఫీచర్లు

సరసమైన ఉత్పత్తుల్లో ఆశించిన స్థాయిలో ఫీచర్లకు చోటెక్కడ ఉంటుంది అనుకుంటే టాటా టిగార్ విశయంలో తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే టాటా వారి బెస్ట్ సెల్లింగ్ కారు టియాగో హ్యాచ్‌బ్యాక్ ఆధారంతో నిర్మించబడిన ఇందులో అదే తరహా ఫీచర్లను అందిస్తోంది. టిగార్‌లో హార్మాన్ 2-డిఐఎన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జెబిఎల్ స్పీకర్లు, బ్లూటూత్, యుఎస్‌బి మరియు ఎయుఎక్స్-ఇన్ కనెక్టివిటి ఫీచర్లతో పాటు ఆప్షనల్ డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగు రానుంది.

ఇంజన్ మరియు గేర్‌బాక్స్

ఇంజన్ మరియు గేర్‌బాక్స్

ఎక్ట్సీరియర్, ఇంటీరియర్, డిజైన్ మరియు ఫీచర్లతో పాటు సాంకేతిక వివరాలు కూడా ఎంతో ముఖ్యం. ముందు తెలిపిన అన్ని అంశాల పరంగా ముందంజలో ఉన్న టిగార్‌లో అత్యుత్తమంగా స్వీకరింపబడుతున్న టియాగోలోని ఇంజన్‌లను టాటా ఇందులో అందిస్తోంది. టియాగోలోని 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న రివట్రాన్ పెట్రోల్ మరియు 1.05-లీటర్ సామర్థ్యం ఉన్న రివటార్క్ డీజల్ ఇంజన్ వేరియంట్లలో టిగార్ కాంపాక్ట్ సెడాన్‌ను ఎంచుకోవచ్చు.

టాటా టిగార్ కాంపాక్ట్ సెడాన్

రెండు ఇంధన వేరియంట్లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను స్టాండర్డ్‌గా అన్ని వేరియంట్లలో అందివ్వనుంది, వీటికి కొనసాగింపుగా భవిష్యత్తులో ఆటోమేటిక్‌ట్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ల అనుసంధానం కూడా వచ్చే అవకాశం ఉంది.

టాటా టిగార్ కాంపాక్ట్ సెడాన్

మారుతి సుజుకి అతి త్వరలో దేశీయంగా 2017 స్విఫ్ట్ ను విడుదల చేయనుంది. హ్యాచ్‌బ్యాక్ కారును కొనే ఆలోచనలో ఉన్నట్లయితే దీని విడుదల వరకు ఆగండి. ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్‌ కన్నా ఇది ఎలాంటి మెరుగైన డిజైన్ లక్షణాలను కలిగి ఉందే తెలుసుకునేందుకు క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయగలరు.

Most Read Articles

English summary
Tata's Upcoming Compact Sedan — The Tigor — Five Things You Should Know
Story first published: Tuesday, February 21, 2017, 11:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X